E-Paper
Advertisement

సింగర్ యశిందర్ కౌర్ దారుణ హత్య.. కిడ్నాప్ అయిన ఐదు రోజుల తర్వాత కాలువలో..

సింగర్ యశిందర్ కౌర్ దారుణ హత్య.. కిడ్నాప్ అయిన ఐదు రోజుల తర్వాత కాలువలో..
Advertisement

Yashinder Kaur: పంజాబీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అదృశ్యమైన ప్రముఖ పంజాబీ వర్ధమాన గాయని యశిందర్ కౌర్ (29) దారుణ హత్యకు గురయ్యారు. తుపాకీ గురిపెట్టి కిడ్నాప్ చేసిన ఐదు రోజుల తర్వాత, మంగళవారం కుబా గ్రామం సమీపంలోని నీలోన్ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. సోషల్ మీడియాలో ‘ఇందర్ కౌర్’గా సుపరిచితురాలైన ఈమె మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read also-భోపాల్‌లో ‘పెద్ది’ మ్యూజికల్ జాతర.. ఆ రోజు ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

తుపాకీ గురిపెట్టి కిడ్నాప్..

Advertisement

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 13వ తేదీ రాత్రి దాదాపు 8:30 గంటల సమయంలో యశిందర్ కౌర్ తన ఫోర్డ్ ఫిగో కారులో కిరాణా సామాను కొనడానికి లూధియానాలోని తన ఇంటి నుండి బయటకు వెళ్లారు. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. జీటీబీ నగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను తుపాకీతో బెదిరించి, బలవంతంగా కారుతో సహా కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కారులో రక్తం..

మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నీలోన్ కాలువలో ఒక మహిళ మృతదేహం తేలుతూండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది యశిందర్ కౌర్ మృతదేహంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రదేశానికి కిలోమీటరు దూరంలోనే ఆమె కారు కూడా దొరికింది. ఆ కారులో పెద్ద ఎత్తున రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. నిందితులు ఆమెను కారులోనే అత్యంత ఘోరంగా హత్య చేసి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి మృతదేహాన్ని, కారును కాలువలో పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ప్రేమ వ్యవహారం

Advertisement

జమాల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దల్వీర్ సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. ఈ దారుణ హత్య వెనుక ప్రేమ వ్యవహారం పాత కక్షలు ఉన్నట్లు తెలిపారు. మోగాకు చెందిన సుఖ్వీందర్ సింగ్ (అలియాస్ సుఖా), యశిందర్ కౌర్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సుఖ్వీందర్ కెనడా వెళ్లిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న సుఖ్వీందర్‌కు ఇప్పటికే వివాహమై పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, అతను యశిందర్‌ను తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. సుఖ్వీందర్ ప్రపోజల్‌ను యశిందర్ పూర్తిగా నిరాకరించడంతో, ఆమెపై పగ పెంచుకున్న అతను ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు.

Read also-ఆ సాంగ్ కోసం మాధురి దీక్షిత్ పడిన కష్టం చూస్తే కన్నీళ్ళాగవు భయ్యా.. గర్భవతిగా ఉన్నా

కెనడా నుండి వచ్చి

ఈ హత్య కోసం ప్రధాన నిందితుడైన సుఖ్వీందర్ సింగ్ ఏప్రిల్ 29న నేపాల్ మీదుగా రహస్యంగా భారతదేశానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మే 13న కిడ్నాప్ హత్యకు పాల్పడిన వెంటనే, అతను అదే రోజు రాత్రి తిరిగి నేపాల్ మార్గంలో కెనడాకు పారిపోయినట్లు విమానాశ్రయ రికార్డుల ద్వారా స్పష్టమైంది. ఈ ఘోర నేరంలో సుఖ్వీందర్‌కు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని తండ్రి ప్రీతమ్ సింగ్, స్నేహితుడు కరమ్‌జీత్ సింగ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుఖ్వీందర్ సింగ్‌ను పట్టుకునేందుకు అంతర్జాతీయ సంస్థల సహాయంతో లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×