Peddi Event: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి నిన్నమొన్నటి ముంబై ట్రైలర్ లాంచ్ వరకు ప్రతి అప్‌డేట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా, ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్‌కు సిద్ధమైంది. మే 23 న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరం వేదికగా ఈ మెగా ఈవెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది.
Read also-వివాదంలో ‘కరుప్పు’ సినిమా.. ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన మూవీ టీం.. ఏం జరిగిందంటే?
ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ భోపాల్‌లోని ప్రసిద్ధ BHEL దసరా మైదానాన్ని ఎంచుకుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ A.R. రెహమాన్ స్వయంగా ఈ వేదికపై లైవ్ కాన్సెర్ట్ ఇవ్వబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రాయ్ రాయ్ రా రా’ వంటి సాంగ్స్ చార్ట్‌బస్టర్‌లుగా నిలవగా.. ఈ ఈవెంట్‌లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ భారీ కాన్సెర్ట్ కోసం మైదానంలో సాంప్రదాయ పూజా కార్యక్రమాలు పూర్తి చేసి, శరవేగంగా పనులు జరుపుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ పెడుతున్న ఖర్చు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లైవ్ షో కోసం దాదాపు రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక సౌండ్, లైటింగ్, ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్‌ను ముంబై నుండి ప్రత్యేకంగా భోపాల్‌కు రప్పిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి కచేరీలకు వాడే ఈ భారీ టెక్నాలజీ సెటప్ కోసం రోజుకు దాదాపు రూ.1 కోటి అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. కేవలం ఒక ఈవెంట్ ఎక్విప్‌మెంట్ రెంట్ కోసమే ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టడం ‘పెద్ది’ మేకింగ్ స్టాండర్డ్స్‌కు, సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
Read also-ఆ సాంగ్ కోసం మాధురి దీక్షిత్ పడిన కష్టం చూస్తే కన్నీళ్ళాగవు భయ్యా.. గర్భవతిగా ఉన్నా
ఈ మ్యూజికల్ నైట్‌లో చిత్రంలోని అత్యంత క్రేజీ స్పెషల్ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్‌లో మాస్ ఎనర్జీతో ఉండేలా ఈ సాంగ్‌ను డిజైన్ చేశారు. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా మెరవనుండటం విశేషం. ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో వచ్చిన ఈ మాస్ నంబర్, థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.