E-Paper
Advertisement

Puri jagannadh: పూరి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్… పూరి రియాక్షన్ ఇదే!

Puri jagannadh: పూరి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్… పూరి రియాక్షన్ ఇదే!
Advertisement

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హీట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక సినిమాల విషయంలో పూరి మార్క్ వేరే లెవల్ అని చెప్పాలి. ఇకపోతే తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)పూరి జగన్నాథ్(Puri Jagannadh) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.

పూరి సింగిల్ పీస్..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బుజ్జిగాడు సినిమాలోని డైలాగుల గురించి ప్రస్తావనకు రావడంతో ప్రభాస్ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ లాంటి గ్రేట్ డైరెక్టర్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ,ఆయన సింగిల్ పీస్ అంటూ కామెంట్లు చేశారు. పూరి జగన్నాథ్ డైలాగులు చాలా అద్భుతంగా రాస్తారు అంటూ ప్రభాస్ పూరి జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడమే కాకుండా తన అభిమానాన్ని కూడా తెలియజేశారు. ఇక పూరి జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్లో బుజ్జిగాడు సినిమాతో పాటు ఏక్ నిరంజన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లవ్ టు అవర్ డార్లింగ్…

Advertisement

ఇలా పూరి జగన్నాథ్ పై ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్వయంగా పూరి జగన్నాథ్ ప్రభాస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. పూరి కనెక్ట్స్ అనే అధికారక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..లవ్ టు అవర్ డార్లింగ్ ప్రభాస్ అంటూ ఈయన హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు. ఇలా ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పూరి అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరికీ పూరీ జగన్నాథ్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోలు కూడా పూరి డైరెక్షన్లో నటించారు అయితే ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను వరుసగా నిరాశకు గురి చేస్తున్నాయి. పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి , సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటించారు.

Also Read: Naa Anvesh: తూచ్..నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదు.. మరో వీడియో వదిలిన అన్వేష్!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×