E-Paper
Advertisement

Naa Anvesh: తూచ్..నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదు.. మరో వీడియో వదిలిన అన్వేష్!

Naa Anvesh: తూచ్..నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదు.. మరో వీడియో వదిలిన అన్వేష్!
Advertisement

Naa Anvesh: ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ యూట్యూబ్ ద్వారా మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ ద్వారా కూడా భారీ స్థాయిలో సంపాదన ఆర్జిస్తున్నారు. ఇలా ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ ద్వారా నిత్యం వీడియోలను షేర్ చేస్తూ భారీగా ఆదాయం అందుకుంటున్న ఈయన ఇటీవల హిందూ మతం గురించి హిందూ దేవుళ్ళ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే భారతదేశ గురించి కూడా ఈయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. ఇలా అన్వేష్ చేసిన వ్యాఖ్యల కారణంగా దాదాపు పది లక్షల మందికి పైగా ఈయనకు అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే.

నా ఈకతో సమానం..

ఇంస్టాగ్రామ్ వేదిక ఇలాంటి వీడియోల షేర్ చేయడంతో ఈయనపై చర్యలు తీసుకోవాలి అంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇంస్టాగ్రామ్ కు లేఖ రాసి తనపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ఈయన అకౌంట్ బ్లాక్ చేయడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది. ఇక ఈ విషయంపై నా అన్వేషణ స్పందిస్తూ.. ఇంస్టాగ్రామ్ నాకు ఈగతో సమానం, ఇంస్టాగ్రామ్ నాకు ఒక చెయ్యి లాంటిది ఒక చెయ్యి పోయిన మరొక చేయితో పని చేస్తానని 2026 లో బత్తాయి రసం పిండుతా అంటూ ఈయన తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు.

ఐడి ప్రూఫ్ తప్పుగా ఇవ్వడంతో 48 గంటలు బ్లాక్..

Advertisement

ఇకపోతే తాజాగా నా అన్వేష్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఈయన ఈ వీడియోలో మాట్లాడుతూ అకౌంట్ బ్లాక్ అయిందని అందరూ భావించారు కానీ నా అకౌంట్ బ్లాక్ అవ్వలేదని జస్ట్ హోల్డ్ చేశారని తెలిపారు. తాను మదనపల్లికి చెందిన అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఆ అమ్మాయి చిన్నమ్మాయి కావడంతో ఇంస్టాగ్రామ్ నా ఐడి ప్రూఫ్ అడిగింది. ఈ నేపథ్యంలోనే తాను ఒక పాస్ పోర్ట్ కి బదులుగా మరొక పాస్ పోర్ట్ ఐడి ప్రూఫ్ ఇవ్వడంతో తప్పుగా ఉన్న నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ 48 గంటల పాటు తన అకౌంట్ బ్లాక్ చేసిందని క్లారిటీ ఇచ్చారు.

?igsh=NTYwNXltbXgzMTl6

Advertisement

ఇలా నా అకౌంట్ బ్లాక్ చేయడంతో నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోయిందని ఒక చిన్న అబద్ధం చెప్పాను అయితే నాపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు నేను అందరూ అనుకున్నట్టు కాదు నేను పక్క హిందువునని నేను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. తాను చేసిన తప్పు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపడం అని, దాని కారణంగానే నన్ను తప్పు పడుతున్నారంటూ ఈ సందర్భంగా అన్వేష్ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇలా తన అకౌంట్ బ్లాక్ అయింది అంటూ నాటకం ఆడారనే విషయాన్ని తెలియచేయడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Vijay Rashmika wedding: విజయ్ రష్మిక వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు ఇచ్చిన గిఫ్ట్ ఇవే!

Related News

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

Big Stories

Advertisement
×