E-Paper
Advertisement

HBD Vijay Sethupathi: సేతుపతి బర్త్ డే ట్రీట్.. ఫస్ట్ లుక్, టైటిల్ కు ముహూర్తం ఫిక్స్!

HBD Vijay Sethupathi: సేతుపతి బర్త్ డే ట్రీట్.. ఫస్ట్ లుక్, టైటిల్ కు ముహూర్తం ఫిక్స్!
Advertisement

HBD Vijay Sethupathi: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా ‘మక్కల్ సెల్వన్’ అని అభిమానుల చేత పిలిపించుకుంటున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) అభిమానులకు సంక్రాంతి పండుగ కబురును తీసుకొచ్చారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమా నుంచి కీలక అప్డేట్ ఇప్పుడు అభిమానులలో ఆసక్తిని పెంచేసింది. గత కొంతకాలంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పూరీ సేతుపతి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా ప్రకటించబోతున్నారు. ఈ మేరకు రేపు అనగా జనవరి 16వ తేదీన విజయ్ సేతుపతి పుట్టినరోజు కావడంతో పూరీ సేతుపతి అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ని పంచుకోబోతున్నారు.

అధికారిక ప్రకటన చేసిన మేకర్స్..

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ముందుగా పొంగల్ శుభాకాంక్షలు తెలియజేసిన చిత్ర బృందం.. రేపు అనగా జనవరి 16వ తేదీన ఉదయం 11 గంటలకు పూరీ సేతుపతి మూవీ నుండి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఒక పోస్టర్ని పంచుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే స్లమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది అని తెలుస్తోంది.

పూరీసేతుపతి సినిమా విశేషాలు..

Advertisement

ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో టబూ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా.. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని చార్మి సమర్పణలో పూరీ కనెక్ట్స్ , జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌరీ, జేబీఎన్ నారాయణరావు కొండ్రోల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు . విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తొలిసారి ఈ మూవీ రాబోతుండడంతో సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో టబు , సంయుక్త మీనన్ తో పాటు వీ.టీ.వీ.గణేష్ , విష్ణు రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మల్టీస్టారర్ కాస్టింగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

ALSO READ:Bulliraju: ఏంట్రా బాబు.. హీరోలనే వెనక్కి నెట్టిన బుల్లిరాజు.. బుడ్డోడా మజాకా!

సినిమా విశేషాలు..

Advertisement

ఈ సినిమా విషయానికొస్తే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని , త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా టైటిల్, టీజర్ గత ఏడాదే రావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ఇక రేపు ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. మొదట బెగ్గర్ అనే టైటిల్ను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై విజయ్ సేతుపతి స్పందించి కొట్టి పారేశారు. మరి ఈ సినిమా ఎలాంటి టైటిల్ తో రాబోతోంది అనే విషయం తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×