E-Paper
Advertisement

Bulliraju: ఏంట్రా బాబు.. హీరోలనే వెనక్కి నెట్టిన బుల్లిరాజు.. బుడ్డోడా మజాకా!

Bulliraju: ఏంట్రా బాబు.. హీరోలనే వెనక్కి నెట్టిన బుల్లిరాజు.. బుడ్డోడా మజాకా!
Advertisement

Bulliraju: ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లను బేస్ చేసుకుని సినిమా కథలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా వరుస సినిమాలలో బిజీగా మారిపోతున్నారు. అంతేకాదు హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో బుల్లిరాజు(Bulliraju ) కూడా ఒకరు. గత ఏడాది అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh ) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ కొడుకు పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో బూతులతో రెచ్చిపోయి ఏంట్రా అనే రేంజ్ లో రెచ్చిపోయారు. అలాంటి బుల్లి రాజు ఇప్పుడు ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఈ సంక్రాంతికి కూడా అదే ఊపులో సందడి చేశారు.

రెమ్యూనరేషన్ విషయంలో హీరోలనే మించిన బుల్లి రాజు..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కూడా నటించి ఆశ్చర్యపరిచారు. ఇకపోతే మరో 10 ప్రాజెక్టులలో భాగమైన ఈ బుల్లి రాజు ఇప్పుడు తన క్రేజ్ తో చిన్న హీరోలను కూడా దాటేశారు అని చెప్పాలి. ముఖ్యంగా బడ్జెట్ ను బట్టి సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పెద్ద సినిమాలకైతే 75 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బుల్లిరాజు.. చిన్న సినిమాలకు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.అంతేకాదు ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్టులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నిర్మాతలు కూడా వెనకాడని వైనం..

Advertisement

వాస్తవానికి చైల్డ్ ఆర్టిస్టులకు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది అసంభవం. కానీ బుల్లిరాజు మాత్రం తన అసాధారణమైన ప్రతిభను చూసిన నిర్మాతలు ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా బుల్లిరాజు కోసం దర్శకులు కూడా ప్రత్యేకమైన కామెడీ ట్రాకులు రాసుకొని మరీ అతన్ని తమ సినిమాలలో పెట్టుకుంటున్నారు. పైగా రెమ్యూనరేషన్ కి ఏమాత్రం తగ్గకుండా నటిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు బుల్లి రాజు.

రెమ్యూనరేషన్ పై బుల్లిరాజు కామెంట్స్..

ఇకపోతే తన రెమ్యూనరేషన్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నాకు ఈ రెమ్యూనరేషన్ గురించి ఎలాంటి అవగాహన లేదు. నా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మా నాన్ననే చూసుకుంటారు. ముఖ్యంగా నా జేబు ఖర్చులకోసం నెలకు 400 రూపాయలు పాకెట్ మనీ ఇస్తారు. వాటిని నేను జాగ్రత్తగా ఒక డిబ్బిలో దాచుకుంటున్నాను. స్కూల్ కి వెళ్లేటప్పుడు షాపులు లేకపోవడం వల్ల బయట చిరు తిండ్లు తీసుకొని తినడం కూడా కుదరదు. ముఖ్యంగా నేను అనవసరంగా డబ్బులు ఖర్చు చేయను. ఒకవేళ ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో అమ్మనే అడిగి చేయించుకుంటాను. ఇక చాక్లెట్లలో అయితే నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. అది మాత్రమే అప్పుడప్పుడు తింటాను అంటూ తెలిపారు బుల్లి రాజు.

బుల్లి రాజు బ్యాక్ గ్రౌండ్..

Advertisement

ఇకపోతే ఈ బుల్లి రాజు అసలు పేరు రేవంత్. మొత్తానికైతే పిఠాపురం ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతుగా ఫ్లకార్డ్ లు పట్టుకొని తిరుగుతూ వెలుగులోకి వచ్చిన ఈ చిన్నారి.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వైరల్ అయిపోయారు. ఇక మరొకసారి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించి మరింత క్రేజ్ దక్కించుకున్నారు.

ALSO READ:Aishwarya Rai: కూతురు విషయంలో ఐశ్వర్య కఠిన నిర్ణయం.. ఎందుకో తెలిస్తే షాక్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×