E-Paper
Advertisement

R.Parthiban: మళ్లీ వివాదంలో ఆర్.పార్థిబన్.. క్షమాపణలు కూడా చెబుతూ!

R.Parthiban: మళ్లీ వివాదంలో ఆర్.పార్థిబన్.. క్షమాపణలు కూడా చెబుతూ!
Advertisement

R.Parthiban:ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ నటుడు ఆర్. పార్థిబన్ (R. Parthiban) ఈ మధ్య వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)పై ఊహించని కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పుడు కులం గురించి మాట్లాడి పెద్ద వివాదానికి దారి తీశారు. అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పార్థిబన్ మాట్లాడిన మాటలే వివాదాన్ని రేపాయి. ఆయన తనను తాను “నాయుడు” అని పరిచయం చేసుకున్నారు. దీంతో తమిళనాడులోని ద్రావిడ సిద్ధాంతం, కుల వ్యతిరేకత గురించి మాట్లాడేవాళ్లు రాష్ట్రం దాటగానే కుల గొప్పలు చెప్పుకోవడం ఏంటి అంటూ నేటిజన్లు కూడా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ చేస్తున్నారు.

మళ్లీ వివాదంలో చిక్కుకున్న పార్థిబన్..

పార్థిబన్ ను స్టేజ్ పై మాట్లాడడానికి పిలిచినప్పుడు ఆయన మాట్లాడుతూ..” ముందుగా నా గురించి చిన్న పరిచయం అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.” నేను పార్థిబన్.. రాధాకృష్ణన్ పార్థిబన్.. ఒక నాయుడు అబ్బాయిని.. అవును ఒక నాయుడు అబ్బాయిని.. కానీ చెన్నైలో పుట్టి పెరగడం వల్ల నాకు తెలుగు రాదు. తమిళం నాకు సహజంగా వచ్చే భాష. కానీ మనం తర్వాతి సారి కలిసినప్పుడు ఈ సినిమా విజయోత్సవ వేడుకలో నేను తెలుగులో మాట్లాడతాను. ఈ మూర్తి మీకు హామీ ఇస్తున్నాడు.. మూర్తి నా అసలు పేరు” అంటూ పార్థిబన్ మాట్లాడారు. దీంతో ఇక్కడ ఆయన నాయుడు అంటూ తన కులాన్ని ప్రస్తావించడమే వివాదానికి కారణం అయ్యింది.

క్షమాపణలు చెప్పిన పార్థిబన్..

Advertisement

ఇకపోతే గతంలో తమిళనాడులో ఒక స్టేజిపై కులానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎక్స్ లో ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఈ వివాదాస్పద ప్రసంగం సమయంలో తమిళనాడు గురించి అగౌరవంగా మాట్లాడారని కూడా ఆ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు మరింత వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా పార్థిబన్ స్పందించారు. వేదికపై ప్రసంగిస్తూ.. “కులం గురించి నేను ప్రస్తావించడం పై విమర్శలు వస్తున్నాయి. నేను కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు చేశాను. అలాంటి నేను ఒక కులాన్ని తక్కువగా చేసి మాట్లాడాలని ఎందుకు అనుకుంటాను? ఇన్నేళ్ల నా కెరియర్ లో ఇలా కులం గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి.. నేను తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. ముఖ్యంగా నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడలేదు. పొరపాటున దొర్లిన ఆ పదానికి క్షమాపణలు చెబుతున్నాను” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు . మొత్తానికైతే పార్థిబన్ ఇప్పుడు కులం గురించి మాట్లాడి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న వేళ క్షమాపణలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:Dhurandhar 2: ధురంధర్ 2కి భారీ షాక్.. ఆ సీన్లు తొలగించిన సెన్సార్!

పవన్ సినిమాలో విలన్ గా తెలుగు ఎంట్రీ..

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , శ్రీ లీల , రాశిఖన్నా హీరోయిన్లుగా, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో ఆర్. పార్థిబన్ విలన్ పాత్ర పోషించారు..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×