E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ 2కి భారీ షాక్.. ఆ సీన్లు తొలగించిన సెన్సార్!

Dhurandhar 2: ధురంధర్ 2కి భారీ షాక్.. ఆ సీన్లు తొలగించిన సెన్సార్!

Dhurandhar 2:ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ధురంధర్ 2 (Dhurandhar 2) సినిమా మేనియా కనిపిస్తోంది. అటు బాలీవుడ్ చిత్రం అయినా సరే ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ చిత్రానికే ప్రజలు నీరాజనం పడుతున్నారు. పైగా తెలుగులో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ కూడా డబ్బింగ్ మూవీ వైపే ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.130 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. పైగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలలో ఒక్కో టికెట్ ధర 3,100 రూపాయలు నిర్ణయించినా .. హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ సినిమా విడుదలైతే మొదటి రోజే రూ.250 కోట్లు రాబట్టడం గ్యారెంటీ అని, ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెడుతుంది అంటూ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఊహించని షాక్ ఇచ్చింది.

ధురంధర్ 2కి సెన్సార్ బోర్డు భారీ షాక్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. పైగా మూడు గంటల 49 నిమిషాల నిడివి తో ఈ సినిమాను లాక్ చేశారు. ఇకపోతే తాజాగా సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా వీక్షించిన తర్వాత బోర్డు సభ్యులు ఏకంగా 21 మార్పులను సూచించారు. అందులో నాలుగు సన్నివేశాలు అత్యంత హింసాత్మకంగా, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని పేర్కొంటూ వాటిని తక్షణమే తొలగించాలని చిత్ర బృందానికి ఆదేశించారు. దీంతో మేకర్స్ ఆయా సీన్లను కట్ చేసి సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ మార్చి 19 అనగా రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ:Dhurandhar 2: ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర అన్ని వేలా..అయినా దొరకని టికెట్.. ఇదెక్కడి క్రేజ్ సామీ!

ధురంధర్ 2పై పేలుతున్న మీమ్స్..

ఇకపోతే ఒకవైపు ఈ సినిమాకి టికెట్లు భారీగా అమ్ముడుపోతూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరొకవైపు సెన్సార్ బోర్డు కొన్ని సీన్లు తొలగించాలని షాక్ ఇచ్చింది. మరోవైపు ఈ సినిమా రన్ టైం పై ఎప్పటిలాగే సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వర్షం కురుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సెన్సార్ పూర్తి చేసుకొని రన్ టైం లాక్ చేసుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 3 గంటల 49 నిమిషాల నిడివి ఉండడంతో థియేటర్లకు వెళ్లేవారు సూట్ కేసులు, స్నాక్స్, దిండు, దుప్పట్లు తీసుకెళ్లాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు . అందుకు సంబంధించిన వీడియోలు, మీమ్స్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇకపోతే ధురంధర్ మొదటి భాగం కూడా 3 గంటల 34 నిమిషాల నిడివి ఉంది. ఇంత సుదీర్ఘమైన సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి నెలకొన్నా మరొకవైపు రికార్డులు బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×