E-Paper
Advertisement

Raja Saab Collections : అమెరికాలో దుమ్ము దులిపేస్తున్న రాజా సాబ్.. వసూళ్లు ఎంతంటే..?

Raja Saab Collections : అమెరికాలో దుమ్ము దులిపేస్తున్న రాజా సాబ్.. వసూళ్లు ఎంతంటే..?
Advertisement

Raja Saab Collections : టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో దరికెక్కిన ఏ మూవీ ఇటీవలే భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చేసింది.. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకుంది. మౌత్ టాక్ తో ఎటువంటి సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగానే పెరుగుతూ వస్తున్నాయి.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేస్తుందని ప్రస్తుతం రాబట్టిన కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది.. ఈ మూవీ ఇప్పటివరకు భారీగానే వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రభాస్ సినిమా కావడంతో చాలామంది అభిమానులు సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.. మరి ఓవర్సీస్ లో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘అమెరికాలో’ రాజా సాబ్ కలెక్షన్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా మొదటి వారాంతం పూర్తి చేసుకుంది.. హారర్, కామెడీ జోనర్ లో వచ్చింది ఈ మూవీ. ఒకవైపు డివైడ్ టాక్ ను అందుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్ లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి.. వ్యాప్తంగా రిలీజ్ అయిన ఏ మూవీ ఒక్కరోజులో 115 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. కేవలం ఫస్ట్ వీకెండ్ లో మాత్రమే 183 కోట్లు రాబట్టి మరో రికార్డ్ ని బ్రేక్ చేసింది.. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.. అక్కడ మొదటి వారం పూర్తయ్యలోగా 2.2 మిలియన్ల డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు రాబట్టిన కలెక్షన్స్ చూస్తే మరోసారి అతని క్రేజెంటో అర్థమవుతుంది.

Advertisement

Also Read :తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్ 5 సీరియల్ హీరోయిన్స్…

అమెరికాలో ప్రభాస్ సినిమాల కలెక్షన్స్.. 

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కి ముందు చేసిన సినిమాలన్నీ కూడా అతనికి మంచి క్రేజ్ ని అందించాయి. ఒక్క బాహుబలి సినిమా మాత్రం దేశ విదేశాల్లో అతనికి మంచి పేరును తీసుకొచ్చింది.. మూవీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరో అయ్యాడు. వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. బాహుబలి నుంచి ఇప్పటివరకు అమెరికాలో రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాల కలెక్షన్ ను చూస్తే.. ‘బాహుబలి 2’ నార్త్ అమెరికాలో $22 మిలియన్లు రాబట్టింది. ఎనిమిదిన్నర ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా అలానే ఉంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా $18.57 మిలియన్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.. సలార్ లో $8.9,బాహుబలి 1′ $8.4, అలాగే సాహో $3.2, ఇప్పుడొచ్చిన రాజా సాబ్ మూవీ 2.2 మిలియన్ల వసూళ్లను అందుకుంది. ఈ మంత్ ఎండింగ్ ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాలలో నటిస్తున్నాడు..

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×