E-Paper
Advertisement

Rajamouli: యానిమేషన్ మూవీగా రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమా..కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న జక్కన్న!

Rajamouli: యానిమేషన్ మూవీగా రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమా..కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న జక్కన్న!
Advertisement

Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి .ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రాజమౌళి తెలియచేశారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ 2027న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో RRR సినిమాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సరికొత్తగా వెండితెర పై RRR..

ఇకపోతే ఈ సినిమా సరికొత్త రూపంలో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 2022వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాని ఇప్పుడు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల వారణాసి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ను అనిమేలో రూపొందించడానికి మేము జపాన్‌లోని కొన్ని స్టూడియోలతో చర్చలు జరుపుతున్నామనీ తెలియజేశారు.త్వరలోనే ఈ చర్చలు పూర్తి అయితే ఈ సినిమా అనిమేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన తెలియజేశారు.

యానిమేషన్ లో RRR సినిమా ..

Advertisement

రాజమౌళి డెమన్ స్లేయర్, ఎటాక్ ఆన్ టైటాన్ వంటి యానిమేటెడ్ సినిమాలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమాలకు తాను అభిమానిగా మారిపోయానని తెలిపారు.. ఈ సినిమాలను యానిమేషన్ రూపంలో చూసిన తర్వాతనే తన డైరెక్షన్లో వచ్చిన RRR సినిమాని కూడా అనిమే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇలా సినిమాల విషయంలో రాజమౌళి ఎప్పటికప్పుడు తన ప్యాషన్ బయట పెడుతూ వినూత్న రీతిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. మరి RRR సినిమా అనిమేకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మాత్రం పూర్తిస్థాయిలో వారణాసి సినిమా పైన ఫోకస్ పెట్టారు. ఇక ఈ సినిమా మహేష్ బాబు సినీ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పాలి ఇందులో మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారు.

Also Read: Allu Arjun: ఆ విషయంలో ఐకాన్ స్టార్ కొత్త ట్రెండ్..అట్లీ సినిమాకు భారీ రెమ్యూనరేషన్

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×