E-Paper
Advertisement

Pakistan vs Netherlands: టీ20 ప్రపంచ కప్ లో మూడు చెరువుల నీళ్లు తాగించిన ప‌సికూన‌..కానీ చివ‌ర‌కు పాకిస్తాన్ దే విజ‌యం

Pakistan vs Netherlands: టీ20 ప్రపంచ కప్ లో మూడు చెరువుల నీళ్లు తాగించిన ప‌సికూన‌..కానీ చివ‌ర‌కు పాకిస్తాన్ దే విజ‌యం
Advertisement

Pakistan vs Netherlands: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఈ టోర్నమెంట్ ప్రారంభం కాగా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ జట్లు ( Pakistan vs Netherlands) తలపడ్డాయి. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నెదర్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 19.5 ఓవర్లు ఆడి 147 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. అయితే ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ పోరాడి మరి గెలిచింది. చివరి వరకు పోరాడిన పాకిస్తాన్ ను ఫహీమ్ అష్రఫ్ ఒంటిచేత్తో గెలిపించాడు. 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 7 వికెట్లు కోల్ప‌యి 19.3 ఓవ‌ర్లలో నెద‌ర్లాండ్ పై విజ‌యం సాధించింది పాకిస్తాన్‌.

Also Read: Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే ( India vs Pakistan)

టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ బోణీ..ఉత్కంఠ పోరులో నెద‌ర్లాండ్ పై విజ‌యం

Advertisement

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇవాళ ప్రారంభమైంది. ఈ ప్రారంభ మ్యాచ్ లో పాకిస్తాన్ బోణీ కొట్టడం కూడా జరిగింది. పసికూడా నెదర్లాండ్ జట్టుపై అతి కష్టం పైన పాకిస్తాన్ విజయం సాధించింది. కొంచంలో ఓటమిని తప్పించుకుంది పాకిస్తాన్ జట్టు. లేకపోతే తొలి మ్యాచ్ లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టేది. కొలంబో వేదికగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ ( Pakistan vs Netherlands, 1st Match) మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది నెదర్లాండ్. ఈ సందర్భంగా పాకిస్తాన్ బౌలర్ల దాటికి 19.5 ఓవర్లు మాత్రమే ఆడింది నెదర్లాండ్ జట్టు.

ఈ నేపథ్యంలోనే 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో లీడే ఒక్కడే 30 పరుగులతో దుమ్ము లేపాడు. అటు స్కాట్ ఎడ్వర్డ్స్ ( Scott Edwards ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ 148 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ చాలా తిప్పలు పడింది. ఫర్హాన్ ఒక్కడే 47 పరుగులు సాధించగా ఆయుబ్ 24 పరుగులతో ఇరగదీశాడు. ఇక మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ డక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ( Salman ali agha) 12 పరుగులకే వెనుతిరిగాడు. చివరలో ఫహీమ్ అష్రఫ్ ఒక్కడే రాణించాడు. 11 బంతుల్లో 29 పరుగులు చేసి పాకిస్థాన్ ను కాపాడాడు ఫహీమ్ అష్రఫ్. లేకపోతే పాకిస్తాన్ ఓడిపోయేది. చివరలో వచ్చి మ్యాచ్ గెలిపించాడు. ఈ ఉత్కంఠ పోరులో అద్భుతంగా రాణించిన ఫహీమ్ అష్రఫ్ ( Faheem Ashraf) కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వ‌చ్చింది.

Advertisement

Also Read: T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ఇదే, ఆసీస్ కు ఎదురుదెబ్బ‌..టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ ఉచితంగా చూడాలంటే

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×