Vanga Chats NAG : అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అప్పట్లో శివ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మళ్లీ అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసింది. యునానిమస్ గా యూత్ ఆ సినిమాని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే కంటెంట్ చెప్పే విధానం కొత్తగా అనిపించింది. తెలుగు ఫిలిం మేకర్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు.
అప్పట్నుంచి సందీప్ రెడ్డి వంగ అంటే ఒక ప్రత్యేకమైన దర్శకుడు అని పేరు పడిపోయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సందీప్ రెడ్డి వంగా అని పిలిచి పొగడ్తలతో ముంచెత్తాడు. వారిద్దరికీ మధ్య ఇప్పటికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కేవలం సందీప్ రెడ్డి వంగాకి రామ్ గోపాల్ వర్మతో మాత్రమే కాకుండా మహేష్ బాబు రాజమౌళి వంటి స్టార్స్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఒక తరుణంలో రాంగోపాల్ వర్మ కి రాజమౌళి ఫోన్ చేసి సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడారట.
నాకు ఫస్ట్ టైం రాజమౌళి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే ఒక రాంగోపాల్ వర్మ కం వన్స్ ఇన్ బ్లూ మూన్ అండ్ సందీప్ రెడ్డి వంగ. ఆ తరువాత రాంగోపాల్ వర్మ నాకు సెకండ్ టైం ఫోన్ చేశాడు అనిమల్ సినిమా చూసిన తర్వాత. నేను సందీప్ రెడ్డి వంగని మీతో పోల్చాను. నేను ఆ పదాలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మ కి సందీప్ రెడ్డి వంగ అనే వాడే బాప్. యాటిట్యూడ్ , స్క్రీన్ ప్లే అవ్వచ్చు, క్యారెక్టర్స్ ని కన్వే చేయడం అవ్వచ్చు ఇంకా చాలా. అని రాజమౌళి నాతో చెప్పాడు.
దాని పరంగా నేను అడుగుతున్నాను సందీప్ నేను శివ సినిమా చేసినప్పుడు నీ ఏజ్ 9 అని చెప్పావు. నాకున్న పాయింట్ ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు. శివ సినిమా నీకు ఏమీ అర్థం అయింది అని అడిగారు.
నాకు చాలా సీన్స్ షాక్ కి గురిచేసాయి. నేను 9 సంవత్సరాల పిల్లాడిన అయినా కూడా నేను ఆ గ్రూపులో యంగ్ గాయ్. చాలామంది 32 సంవత్సరాల ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు. సినిమాకి వెళ్తున్నప్పుడు. సినిమా అయిపోయిన తర్వాత అక్టోబర్ 5వ తారీఖు గురించి చాలా సార్లు మేము రీ కల్లెక్ట్ చేసుకున్నాం. జెమిని థియేటర్లో చూసాం అని పదేపదే మాట్లాడుకునేవాళ్లం.
నేను అప్పటివరకు ఎప్పుడు కొట్టినా కూడా అరిచి పరిగెత్తడము దాని రీసౌండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశా. ఇక్కడ ఏమీ లేదు. సీరియస్ కట్ మాత్రమే ఇక్కడ ఉంది. అంటూ చాలా సందీప్ రెడ్డి వంగ రాంగోపాల్ వర్మతో ఎక్స్ప్రెస్ చేశాడు.
Also Read: Ajith: స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు, గతంలో చాలామందికి