BigTV English

Rajasekhar: రౌడీ జనార్దన్.. విజయ్ కు విలన్ గా యాంగ్రీ హీరోనే పట్టారే

Rajasekhar: రౌడీ జనార్దన్.. విజయ్ కు విలన్ గా యాంగ్రీ హీరోనే పట్టారే

Rajasekhar: యాంగ్రీ హీరో రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటలొచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఫ్యామిలీ హీరో గా.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకేమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక వయస్సు పెరుగుతున్నా కూడా హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన రాజశేఖర్ గతకొంతకాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.


అయితే గతేడాది నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సపోర్టింగ్ యాక్టర్ గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడంతో మళ్ళీ రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఈ ఏడాది మరోసారి టాలీవుడ్ పై యుద్ధం ప్రకటించాడు యాంగ్రీ హీరో. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ, పట్టువదలని విక్రమార్కుడులా విజయ్ హిట్ కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం  రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి రౌడీ జనార్దన్.


రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గాన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం యాంగ్రీ హీరో రాజశేఖర్.. రౌడీ జనార్దన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కు ధీటైన విలన్ కోసం వెతుకుతుండగా రాజశేఖర్ అయితే బావుంటుందని .. పాత్రలో కూడా చాలా ప్రాధాన్యత ఉండడంతో ఆయన అయితే న్యాయం చేస్తాడని భావించి మేకర్స్ రాజశేఖర్ ను సంప్రదించడం, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పడం జరిగినట్లు తెలుస్తోంది.

నిజం చెప్పాలంటే రాజశేఖర్ కు ఇది చాలా మంచి అవకాశం. సపోర్టివ్ రోల్స్ లో, విలన్ రోల్స్ లో నటిస్తే చాలా మంచి అవకాశాలు ఇంకా వస్తాయి. హీరోగా స్టార్స్ అయినవారందరూ ఇప్పుడు ఇలానే రీఎంట్రీ ఇస్తున్నారు. అందులో రాజశేఖర్ కూడా చేరాడు. ఇది మాత్రమే కాకుండా శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రంలో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో రాజశేఖర్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Kantara Chapter 1 Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్‌… కానీ అసలు పాయింట్ మిస్..!

Pawan Kalyan : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ జంధ్యం చూశారా… దేంతో చేశారంటే ?

Pawan Kalyan: పవన్.. కొద్దిగా ఓవర్ అనిపించలేదు

Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. ఇలా ఎప్పుడైనా చూశారా.. మెంటలెక్కిపోతుంది మావా

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

Big Stories

×