E-Paper
Advertisement

రజినీ ఫ్యాన్స్‌కు షాక్ మీద షాక్.. ‘తలైవర్ 173’ నుంచి మరో డైరెక్టర్ అవుట్? అసలు ఏం జరుగుతోంది!

రజినీ ఫ్యాన్స్‌కు షాక్ మీద షాక్.. ‘తలైవర్ 173’ నుంచి మరో డైరెక్టర్ అవుట్? అసలు ఏం జరుగుతోంది!
Advertisement

Rajinikanth Movies: నాదారి రహదారి.. అంటూ ఏడు పదులు దాటి ఐదేళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అడ్డే లేకుండా దూసుకుపోతున్నాడు రజినీ కాంత్. ఆ క్రమంలోనే సెట్స్‌పై జైలర్ 2 ని పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు కమల్ ప్రొడ్యూసర్‌గా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ‘తలైవర్ 173’ అంటూ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమా అనౌన్స్ అయినప్పుడు డైరెక్టర్ గా సుందర్ సి ని కన్ఫాం చేశారు కూడా. కానీ ఏమైందో ఏమో గానీ ఉన్నపళంగా నేను ఈ సినిమా చేయలేనంటూ రెండు మూడు రోజుల్లోనే ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చేశాడు సుందర్. దీంతో ఇలా సడెన్ గా అనౌన్స్ అయిన డైరెక్టర్ ఎందుకు బయటకొచ్చాడా అంటూ చెవులు కొరుక్కుంది కోలీవుడ్.

శిబి చక్రవర్తి ఫిక్స్ అంటూ ఏకంగా

Advertisement

ఇక అప్పటి నుండి ఈ సినిమాకి మెగా ఫోన్ పట్టే డైరెక్టర్ విషయంలో వినిపించే అప్ డేట్స్‌తో ఫ్యాన్స్ మైండ్ షేక్ అవుతోంది. ఒకసారి లోకేష్ కనగరాజ్ అని, మరోవైపు నెల్సన్ అని ఇలా రోజుకో పేరు వినబడటంతో అసలు ఈ సినిమాకి యాక్షన్ చెప్పేవారు ఎవరా అంటూ క్యూరియస్ గా వాచ్ చేశారంతా. ఇక వాళ్ళు వీళ్ళు కాదు శిబి చక్రవర్తి ఫిక్స్ అంటూ ఏకంగా రజినీతో దిగిన ఫోటో బయటికి రావడంతో హమ్మయ్య ఇప్పటికైనా డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని మురిసిపోయారు తమిళ తంబీలు.

also read:మెగాస్టార్ ఆగిపోయిన సినిమా వెనుక ఆ హీరోయిన్! రజనీకాంత్‌తో చిరు విలన్ గా మారడానికి అసలు కారణం ఇదేనా?

Advertisement

ఆ ప్లేస్ లోకి డ్రాగన్  ఫేమ్ అశ్వత్ మారిముత్తు?

కానీ సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు శిబి చక్రవర్తి కూడా ఎగ్జిట్ ఇచ్చాడని, ఆ ప్లేస్ లోకి ‘ఓ మై కడవులే’ డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు వచ్చాడని లేటెస్ట్ కోలీవుడ్ నాట వినిపిస్తున్న టాక్. ఈ డైరెక్టర్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ శింబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. మరి ఈ కుర్ర డైరెక్టర్ అయినా సినిమా మొదలయ్యేవరకు ఉంటాడా లేక మరో డైరెక్టర్ ఎంట్రీ ఇస్తాడా చూడాలి. అయితే సిబి చక్రవర్తి విషయంలో కోలీవుడ్‌లో ఓ క్రేజీ గాసిప్ తెగ చక్కర్లు కొడుతుంది. సిబి ఆ మధ్య నేచురల్ స్టార్ నానితో సినిమా చేస్తానని హైదరాబాద్‌లో ఆఫీస్ తెరిచి, షూటింగ్ మొదలవ్వకముందే 5 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయించారట. చివరికి ఆ సినిమా ఆగిపోవడంతో, నిర్మాతలు నిలదీస్తే కోటిన్నర కట్టి సెటిల్ చేసుకున్నారన్నది ఆ గాసిప్ సారాంశం. మరి ఇందులో నిజానిజాలు ఏంటన్నది వాళ్ళలో ఎవరో ఒకరు బయటపెడితే గానీ తెలీదు.

 పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు అంటూ

ఇక ‘తలైవర్ 173’ సంగతి ఇలా ఉంటే నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ‘జైలర్ 2’ పరిస్థితి కూడా గొప్పగా ఏం లేనట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. కానీ ప్రొడక్షన్ జరుగుతున్న వాలకం చూస్తుంటే ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. దీనికి ప్రధాన కారణం.. సినిమాలో ఉండాల్సిన భారీ క్యామియోల కోసం సరైన స్టార్ హీరోలు దొరకకపోవడమేనన్నది ఇన్ సైడ్ టాక్. ఒకసారి షారుక్ అని, మరోసారి బాలయ్య అని క్యామియోల విషయంలో రోజుకో వార్త వినిపిస్తుంది. కానీ ఇపుడు వీళ్ళెవరు కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు అంటూ ఓ వార్త తెగ సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ వార్తల్లో అసలు నిజమెంతో మేకర్సే బయటపెట్టాలి.

‘లాల్ సలామ్’, ‘కూలీ’ సినిమాలు బోల్తా

నిజానికి జైలర్ 400 కోట్లు కొల్లగొట్టడంతో రజినీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయ్. కానీ ఆ తర్వాత వచ్చిన ‘లాల్ సలామ్’, ‘కూలీ’ సినిమాలు బోల్తా కొట్టడంతో జైలర్ 2, ‘తలైవర్ 173’లతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాడట రజిని. అందుకే ఈ సినిమాల విషయంలో ఖచ్చితంగా ఉంటున్నాడన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ‘తలైవర్ 173’ కుర్చీలో ఫైనల్‌గా ఎవరు కూర్చుంటారో.. అసలు ‘జైలర్ 2’ ఎప్పుడు థియేటర్లకు వస్తుందో!

also read:ప్లాప్ డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ రిస్క్…వర్కౌట్ అయ్యేనా ?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×