Rakul Preet Singh: టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. మరోసారి తన వర్కౌట్ వీడియోతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొత్త ఉద్యోగంలో చేరినంత కష్టంగా ఉందంటూ ఆమె పంచుకున్న క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాబోయే ‘రామాయణ’ చిత్రంలో సూర్పనఖ పాత్రకు సిద్ధమవుతున్న రకుల్, ఆ పాత్ర కోసం ఎలాంటి కఠినమైన కసరత్తులు చేస్తోందో ఈ వీడియో ద్వారా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ వివరాలు ఇలా వున్నాయి..
తన శరీరానికి పాత మెలకువలు నేర్పించడం కొత్త ఉద్యోగంలో చేరినంత కష్టంగా ఉందని రకుల్ సరదాగా రాసుకొచ్చింది. కొన్ని రోజులు శరీరం మాట వింటుందని, మరికొన్ని రోజులు చర్చలు జరుపుతుందని, అసలు బాస్ ఎవరో గుర్తుచేస్తుందని ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏది ఏమైనా రోజూ జిమ్‌కు వెళ్లి కష్టపడాల్సిందేనని ఆమె నిరూపిస్తోంది.
ఈ వర్కౌట్ వీడియోలో రకుల్ ప్రధానంగా చేతుల బలం పెంచే వ్యాయామాలపై దృష్టి పెట్టింది. లాట్ మెషీన్‌పై కసరత్తులు చేస్తూ, ట్రైసెప్స్ కోసం రోప్ అటాచ్‌మెంట్, అలాగే విభిన్న పుల్లింగ్ యాంగిల్స్ కోసం డబుల్-డి హ్యాండిల్‌ను ఉపయోగించింది. ఆమె పడుతున్న కష్టం చూస్తుంటే పాత్ర కోసం ఎంతలా శ్రమిస్తుందో అర్థమవుతోంది.
జిమ్‌లో ఎంత బరువు ఎత్తుతున్నాం అనేదానికంటే, పోశ్చర్ ఎంత సరిగ్గా ఉందనేదే ముఖ్యమని రకుల్ ఈ వీడియో ద్వారా గట్టిగా చెబుతోంది. ఇక శరీరాన్ని వంచడం లేదా ఊపడం లాంటివి చేయకుండా, వీపును నిటారుగా ఉంచి చేసే వ్యాయామాలే సరైన ఫలితాలనిస్తాయని ఆమె తెలిపింది.
ALSO READ: వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?
ఇటీవల ఆమె రొటీన్‌లో భాగంగా చేసిన బార్‌బెల్ డెడ్‌లిఫ్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఎవరికి పడితే వారికి నైపుణ్యం లేకుండా చేసే వ్యాయామం కాదని హెచ్చరిస్తోంది. ఇక మోకాళ్ళు, వీపును సరైన భంగిమలో ఉంచకపోతే నడుముపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే పెద్ద లిఫ్ట్స్ చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ ఎంతైనా అవసరమని ఆమె గుర్తుచేస్తోంది.
ఇక సినిమాల్లో నటనతోనే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ ఫిట్‌నెస్ కోసం రకుల్ పడే తపన అందరికీ ఆదర్శం. ఇక నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’లో అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రను పోషిస్తోంది. లంకాధిపతి రావణుడి సోదరి అయిన శూర్పణఖ పాత్రలో రకుల్ కనిపించనుంది. ఇక రామాయణంలో కథను మలుపు తిప్పే ప్రధానమైన పాత్ర ఇది. రాబోయే సినిమాల కోసం ఆమె పడుతున్న ఈ కఠిన శ్రమ ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని, అభిమానులు ఆమె కొత్త లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==