E-Paper
Advertisement

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్
Advertisement

Action Comedy Adventure: ఒక అమెరికన్ ఫైటర్ పైలట్ శత్రు దేశంలో ఒంటరిగా చిక్కుకుపోతే ? పైగా అతన్ని వెతికేందుకు రష్యా సైన్యం మొత్తం రంగంలోకి దిగితే ? అలాంటి సమయంలో ఓ మాజీ కేజీబీ ఏజెంట్ ఊహించని విధంగా అతనికి అండగా నిలిస్తే ? శత్రువులుగా ఉండాల్సిన ఈ ఇద్దరూ కలిసి చేసే సాహసాలు, వాటి మధ్య పండే కామెడీనే ‘మేడే’ (Mayday) సినిమా. యాక్షన్‌ తో పాటు 80ల నాటి బడ్డీ-కాప్ సినిమాల తరహా హ్యూమర్‌ ను కలిపిన ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రపంచం మొత్తం శీతల సమరం ఉద్రిక్తతల్లో ఉన్న సమయం. అమెరికా నేవీకి చెందిన హాట్‌షాట్ ఫైటర్ పైలట్ లెఫ్టినెంట్ ట్రాయ్ ‘అసాసిన్’ కెల్లీ అత్యంత రహస్యమైన బ్లాక్-ఆప్స్ మిషన్‌ పై రష్యా గగనతలంలోకి వెళ్తాడు. కానీ మిషన్ అనుకున్నట్లుగా సాగదు. అనుకోకుండా ఓ రష్యన్ ఫైటర్ జెట్‌ తో ఢీకొన్న అతని విమానం ధ్వంసమవుతుంది. ప్రాణాలతో బయటపడిన ట్రాయ్ సైబీరియా అడవుల్లో ప్యారాచూట్‌ తో దిగాల్సి వస్తుంది.

Advertisement

చుట్టూ శత్రు భూభాగం. ఎక్కడ చూసినా ప్రమాదమే. ఎలాగైనా అక్కడి నుంచి బయట పడాలని ప్రయత్నిస్తున్న ట్రాయ్‌ కు అనుకోని పరిచయం ఎదురవుతుంది. అతను నికోలాయ్ ఉస్తినోవ్ అనే మాజీ కేజీబీ ఏజెంట్‌ ను కలుస్తాడు. సాధారణంగా ఒక అమెరికన్ పైలట్ కనిపిస్తే అతన్ని పట్టుకోవాలి లేదా చంపాలి. కానీ నికోలాయ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అమెరికన్ పాప్ కల్చర్ అంటే అతనికి విపరీతమైన అభిమానం. ముఖ్యంగా ‘టాప్ గన్’ లాంటి సినిమాలు, అమెరికన్ సంగీతం అతనికి బాగా ఇష్టం. దీంతో ట్రాయ్‌ ను శత్రువుగా కాకుండా ఓ ఆసక్తికరమైన వ్యక్తిగా చూస్తాడు.

చివరికి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇదిలా ఉంటే రష్యన్ సెక్యూరిటీ అధికారి అలెగ్జాండర్ వోల్కోవ్ నేతృత్వంలో సైన్యం ట్రాయ్ కోసం భారీగా గాలింపు మొదలు పెడుతుంది. దీంతో ట్రాయ్, నికోలాయ్ కలిసి తప్పించుకునే ప్రయత్నం మొదలు పెడతారు. మిలిటరీ ట్రక్కులు, రైళ్లు దొంగిలించడం నుంచి మాస్కోలోని అమెరికన్ ఎంబసీకి చేరుకునే వరకు వీరి ప్రయాణం ఎన్నో ప్రమాదాలు, అనూహ్య మలుపులు, కామెడీ పరిస్థితులతో సాగుతుంది. ఒకవైపు ప్రాణాల కోసం పోరాటం… మరోవైపు ఒక అమెరికన్ పైలట్, మాజీ రష్యన్ ఏజెంట్ మధ్య ఏర్పడిన విచిత్రమైన స్నేహం. ఈ రెండింటినీ యాక్షన్, హ్యూమర్‌తో కలిపి చూపించే కథే ‘మేడే’.

ఓటీటీలో ఎక్కడ చూడచ్చు ?

Advertisement

జాన్ ఫ్రాన్సిస్ డేలీ, జోనాథన్ గోల్డ్‌స్టెయిన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-కామెడీలో రైన్ రేనాల్డ్స్, కెన్నెత్ బ్రనాగ్, మార్సిన్ డొరొసిన్స్కీ కీలక పాత్రల్లో నటించారు. 80ల నాటి బడ్డీ-కాప్ సినిమాల ఫీల్‌తో రూపొందిన ఈ మూవీ ‘ఆపిల్ టీవీ ప్లస్’ (Apple TV+)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోలోనే చూడాలి. ఈ సినిమా యాక్షన్‌తో పాటు ఫన్, ఇద్దరు భిన్నమైన వ్యక్తుల మధ్య స్నేహం, రష్యా నేపథ్యంలోని ఎస్కేప్ కథ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

Read Also: హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

Related News

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

Big Stories

Advertisement
×