E-Paper
Advertisement

‘తండ్రి వారసత్వం అంటే కేవలం స్టార్‌డమ్ కాదు’.. రామ్ చరణ్ ఎమోషనల్..

‘తండ్రి వారసత్వం అంటే కేవలం స్టార్‌డమ్ కాదు’.. రామ్ చరణ్ ఎమోషనల్..
Advertisement

Ram Charan: సినిమా రంగంలో వారసత్వం అంటే కేవలం తండ్రి పేరును వాడుకోవడం లేదా ఆయన సంపాదించిన క్రేజ్‌ను కొనసాగించడం మాత్రమే అని చాలామంది భావిస్తారు. కానీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దృష్టిలో వారసత్వం అంటే అంతకంటే ఎంతో లోతైనది. ఇటీవల ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాల గురించి చరణ్ మనసు విప్పి మాట్లాడారు.

Read also-మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో విలన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్!

వర్క్-లైఫ్ బ్యాలెన్స్

Advertisement

చిరంజీవి గారు దశాబ్దాల కాలంగా టాలీవుడ్ అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకున్న స్టార్‌డమ్, బిజీ షెడ్యూల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇంత బిజీగా ఉండి కూడా ఆయన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందని చరణ్ పేర్కొన్నారు. “నాన్నగారు రోజుకు కేవలం 4 గంటలే నిద్రపోయిన రోజులు నాకు గుర్తున్నాయి. అదే సమయంలో, షూటింగ్‌లకు పూర్తిగా విరామం ఇచ్చి, ఇంట్లో అందరు కజిన్స్‌తో కలిసి మూడు రోజుల పాటు సరదాగా గడిపిన సందర్భాలూ ఉన్నాయి. స్టార్‌డమ్‌ను అనుభవిస్తూనే, ఇంట్లో ఒక సాధారణ తండ్రిలా మాకు అందుబాటులో ఉండటం ఆయనకే సాధ్యం. ఈ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌నే నేను అసలైన లెగసీగా భావిస్తున్నాను” అని చరణ్ తెలిపారు.

కష్టాల్లో తోడుండే గుణం

కేవలం కుటుంబ సభ్యులకే కాకుండా, చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే మొదటి వ్యక్తి చిరంజీవి గారు అని చరణ్ గర్వంగా చెప్పారు. ఎవరికైనా సలహా కావాలన్నా, మద్దతు అవసరమైనా ఆయన ఎప్పుడూ ముందుంటారని, అందరి కోసం సమయాన్ని వెచ్చిస్తారని చరణ్ వివరించారు. ఈ సేవా గుణం, నిబద్ధత తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన అన్నారు.

Advertisement

Read also-సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన అనన్య నాగళ్ల.. నెల సంపాదన తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే!

విమర్శలను ఎదుర్కోవడం..

సినీ రంగంలో ప్రశంసలతో పాటు విమర్శలు, అవమానాలు ఎదురవ్వడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నిలబడాలి అనే అంశంపై చిరంజీవి గారు ఇచ్చే సలహాను చరణ్ గుర్తు చేసుకున్నారు. “లోకం విమర్శిస్తుంది, అవమానిస్తుంది.. కానీ మనల్ని మనం నమ్ముకున్నప్పుడు, మన ఆత్మగౌరవం మనల్ని బలంగా ఉంచుతుంది. మనం చేసే పని సరైనదని మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఏ శక్తీ మనల్ని కదిలించలేదు” అని తన తండ్రి చెప్పే మాటలను చరణ్ ఉటంకించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నిసార్లు కింద పడినా.. మళ్ళీ అంతే ఆత్మవిశ్వాసంతో చిన్-అప్ చేసి నిలబడటం తన తండ్రికి ఉన్న గొప్ప లక్షణమని చరణ్ కొనియాడారు. గత 71 ఏళ్లుగా ఆయన చూపిస్తున్న ఈ క్రమశిక్షణ, పని పట్ల ఉన్న గౌరవమే తనను ఈ స్థాయికి చేర్చాయని రామ్ చరణ్ ఎంతో వినయంగా చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×