E-Paper
Advertisement

మూడు సార్లు గాయాలు.. త్వరలోనే సర్జరీ.. ‘పెద్ది’ కోసం ప్రాణం పెట్టిన మెగా పవర్ స్టార్

మూడు సార్లు గాయాలు.. త్వరలోనే సర్జరీ.. ‘పెద్ది’ కోసం ప్రాణం పెట్టిన మెగా పవర్ స్టార్
Advertisement

Peddi : జూన్ 4 ..అంటే మరో పదిహేడు రోజుల్లో థియేటర్లోకి అడుగెట్టబోతున్నాడు పెద్ది . సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా కోసం ఇప్పటికే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్ లో వేగం పెంచింది మూవీ టీమ్ .ఈ క్రమంలోనే ఈ రోజు మధ్యాహ్నం ముంబై వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్ .

అయితే గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ చేతికి కట్టుతో కనిపిస్తుండటంతో ఏమైందా అని ఆరా తీసే పనిలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అయితే తాజాగా ముంబై ట్రైలర్ లాంచ్ వేదికగా చరణ్ స్వయంగా తన గాయంపై క్లారిటీ ఇచ్చి అభిమానులను కూల్ చేశాడు.”నా చెయ్యి ఇప్పుడు బాగానే ఉంది. ఇది మా దర్శకుడు బుచ్చిబాబు నాకు ఇచ్చిన అందమైన బహుమతి” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు చరణ్.

Advertisement

also read :‘కల్కి పార్ట్ 2’ సెట్స్‌లో ల్యాండ్ అయిన సుప్రీం యాస్కిన్.. రూల్స్ బ్రేక్ చేసిన లోకనాయకుడు!

ఏకంగా రియల్ పహిల్వాన్లను రంగంలోకి దించడంతో 

Advertisement

ఈ సినిమా కోసం గత 25-30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా కుస్తీ (రెజ్లింగ్) సన్నివేశాలను చిత్రీకరించారట. షూటింగ్ కోసం నటులను తీసుకురమ్మంటే, బుచ్చిబాబు ఏకంగా రియల్ పహిల్వాన్లను రంగంలోకి దించాడని చరణ్ సరదాగా కామెంట్ చేశాడు. డైరెక్టర్ యాక్షన్ అనగానే ఆ నిజమైన ఫైటర్లు చరణ్‌ను గట్టిగా పట్టుకోవడంతో, మణికట్టు దగ్గర ఎముక విరిగిందని అసలు విషయం బయటపెట్టారు.

ఇక పొతే చరణ్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ సమయంలో ఆయన మూడుసార్లు గాయపడ్డారు. మొదట్లో కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకసారి, ఇటీవలి క్లైమాక్స్ చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి.ఇక వచ్చే రెండు మూడు రోజుల్లో వీటికి సంబంధించిన సర్జరీలు జరగనున్నట్లు నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు తెలిపారు .

also read :వీడియో వైరల్.. కదులుతున్న రైలులో ఊహించని దృశ్యం.. తోటి ప్రయాణికులు షాక్!

వచ్చే నెల 4న  ‘పెద్ది’ఎలాంటి పూనకాలు తెప్పిస్తుందో

ఇక సినిమా విషయానికి వస్తే, ఇదొక హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా రా అండ్ రస్టిక్ లుక్ లో క్రికెటర్, రెజ్లర్, మరియు రన్నర్‌గా చరణ్ తన విశ్వ రూపాన్ని చూపించబోతున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమయింది.పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో.. ఒక స్టార్ అథ్లెట్ అయిన హీరో, ఢిల్లీకి వెళ్లి కూలీ పని చేయాల్సి వస్తుంది. అసలు అంతటి ఆటగాడు కూలీగా ఎందుకు మారాడు? ఢిల్లీ ప్రయాణంలో పెద్ది ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? అనేది సినిమా కథ అని తెలుస్తుంది. ఇక చరణ్ ‘రంగస్థలం’ (2018 మార్చి 30) తర్వాత చరణ్ మళ్లీ పల్లెటూరి నేపథ్యంలో చేస్తున్న పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్ ఇదే కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలె ఉన్నాయి.చూడాలి ..వచ్చే నెల 4న థియేటర్లలో ‘పెద్ది’ఎలాంటి పూనకాలు తెప్పిస్తుందో !

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×