E-Paper
Advertisement

వీడియో వైరల్.. కదులుతున్న రైలులో ఊహించని దృశ్యం.. తోటి ప్రయాణికులు షాక్!

వీడియో వైరల్.. కదులుతున్న రైలులో ఊహించని దృశ్యం.. తోటి ప్రయాణికులు షాక్!
Advertisement

Train Puja : కదిలే రైలులో సీట్ దొరికి పీస్ ఫుల్ గా జర్నీ చేసే అవకాశం దొరికితే అదే పదివేలు అనుకునే ఈ రోజుల్లో ఏకంగా రైలు లో పూజ సెటప్పే పెట్టేసింది ఈవిడ. పూజ చేయడానికి మనసుండాలే కాని ఏదీ అడ్డు కాదని ప్రూవ్ చేసింది. భర్త ఆయురారోగ్యాల కోసం భార్యలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే “వట సావిత్రి వ్రతం” రోజున ఆమెకు రైలు ప్రయాణం ఎదురైంది. ప్రయాణంలో ఉన్నాం కదా అని ఆమె అస్సలు తగ్గలేదు.పూజను వాయిదా వేసుకోలేదు. సంప్రదాయంపై ఆమెకున్న పట్టుదల, భర్తపై ఉన్నప్రేమ ఇప్పుడు నెట్టిల్లు ని షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక క్రేజీ వీడియోనే ఇపుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

also read :ఫ్రైడ్‌ రైస్ ప్లేట్ రూ.1400.. అయినా క్యూ కడుతున్న జనాలు.. ఈ 19 ఏళ్ల బాబు గారి క్రేజే వేరు!

Advertisement

ముందు చూపుతో పూజా సామాగ్రిని అంతా 

విషయంలోకి వెళ్తే …హిందూ సంప్రదాయంలో జ్యేష్ఠ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉందో తెలిసిన సంగతే. ఈ రోజున వివాహిత మహిళలు తమ సౌభాగ్యం కోసం వట సావిత్రి పూజ (Vat Savitri Puja) నిర్వహిస్తారు. ఈ పూజలో మర్రి చెట్టు (వట వృక్షం) ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మర్రి చెట్టుకు పసుపు, కుంకుమలు పెట్టి, నూలు దారాన్ని చుడుతూ ప్రదక్షిణలు చేయడం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. సరిగ్గా పూజ రోజే ఆ మహిళకు లాంగ్ జర్నీ పడింది. సాధారణంగా అయితే ఎవరైనా ఇంట్లోనో లేదా ఊరెళ్లాక పూజ చేసుకుంటారు. కానీ ఈమె మాత్రం ముందు చూపుతో  ఒక చిన్న మర్రి చెట్టు కొమ్మను, పూజా సామాగ్రిని తనతో పాటు రైలులోకి తీసుకువెళ్లింది.

Advertisement

కదులుతున్న రైలులోనే ..

రైలు వేగంగా కదులుతున్న సమయంలో, తోటి ప్రయాణికుల మధ్యే తన సీటు పక్కన ఆ మర్రి కొమ్మను అమర్చింది. దానికి సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు అద్ది భక్తితో నమస్కరించింది. తర్వాత ఆ చిన్న మర్రి కొమ్మ చుట్టూ పవిత్రమైన తెల్లటి నూలు దారాన్ని చుడుతూ ప్రార్థనలు చేసింది. రైలు అటూ ఇటూ లోనవుతున్నా, ఏమాత్రం తొణకకుండా ఆమె చేసిన వినూత్న పూజా విధానాన్ని చూసి తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సాధారణంగా సినిమాల్లో భక్తిని, సెంటిమెంట్‌ను ఎంత అద్భుతంగా చూపిస్తారో, అంతకంటే గొప్పగా రియల్ లైఫ్‌లోనే సీన్ కనిపించింది.ఇక ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడున్న కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌ అయిపొయింది.

నిబద్ధతకు ఒక మంచి ఎగ్జాంపుల్

ఇక ఈ వీడియో ఇలా వచ్చిందో లేదో “పరిస్థితులు ఏవైనా సంప్రదాయాన్ని, భర్తపై ఉన్న ప్రేమను చాటుకోవడంలో భారతీయ మహిళలకు సాటి ఎవరూ లేరు” అని కొందరు కామెంట్లు పెడుతుండగా, “రైలు ప్రయాణంలో కూడా ఇంత ప్రశాంతంగా, నిష్టగా పూజ చేసుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం” అంటూ మరికొందరు ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏదేమైనా, నేటి డిజిటల్ యుగంలో ఈ వీడియో సంస్కృతి, ఆచారాల పట్ల ఉన్న నిబద్ధతకు ఒక మంచి ఎగ్జాంపుల్ గా నిలిచిందనే చెప్పాలి.

also read :పెళ్లయిన 5 నెలలకే నరకం .. టాలీవుడ్ నటి డెత్ మిస్టరీ..లవ్ మ్యారేజ్ చివరకు ఇలా ముగిసిందా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×