E-Paper
Advertisement

Peddi  : పెద్దికి బ్రేక్ పడ్డట్టేనా ?

Peddi  : పెద్దికి బ్రేక్ పడ్డట్టేనా ?
Advertisement

Peddi  :వస్తామంటూ హడావిడి చేయడం ..తీరా రాలేమంటూ వెనక్కి వెళ్ళిపోవడం ఇండస్ట్రీలోకామన్ అయిపొయింది. తాజాగా పెద్ది కూడా ఇపుడు ఇదే డైలమాలో ఉన్నట్టు కనిపిస్తుంది.అవును..చరణ్ , బుచ్చి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయ్ కాని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలే ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నాయ్.ఎన్ని వార్తలు వచ్చినా మేకర్స్ ఏప్రిల్ 30న వచ్చేది పక్కా అని క్లారిటీ ఇస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయ్.

వాస్తవానికి ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అనుకుంటే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రేపటినుండే షురూ కావాలి.కాని ఉన్నపళంగా వీటిని ఏప్రిల్ 8 కి పోస్ట్ పోన్ చేయడంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తారా అన్న అనుమానాలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.,మేకర్స్ ఎంత కవరప్ చేసినా ఇన్ సైడ్ ఎదో జరిగిపోతుందన్నటాక్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టనీయడం లేదు.

Advertisement

వాస్తవానికి సినిమా ఇపుడు పోస్ట్ పోన్ అవ్వడానికి రెండు రీజన్స్ వినిపిస్తున్నాయ్.ఈమధ్యే చరణ్ కంటికి గాయం అవడం,దానివల్ల షూటింగ్ కి బ్రేక్ పడటం అందులో ఒకటి.ఇక ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని అందుకోసం మృణాల్ ఠాకూర్ స్టెప్పులు వేయబోతుందని టాక్ వినిపిస్తున్నా ఇంకా ఎలాంటి అనౌన్స్ ఇప్పటి వరకు లేదు. అయితే బుచ్చి ఈ సాంగ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయడంతో ఇది మరింత లేట్ అవడానికి కారణం అన్న టాక్ వినిపిస్తుంది.

మరో వైపు చరణ్ గనుక తన పెద్ది ని రేసు నుంచి తప్పిస్తే అదే ఏప్రిల్ ౩౦న ఎటాక్ చేసేందుకు గాయపడ్డ సింహాన్ని రెడీ గా పెట్టేసింది మూవీ టీమ్. ఇప్పటికే మే 1 రిలీజ్ అంటూ ప్రోమోలు రెడీ అయిపోతున్నాయ్ కూడా.మరో వైపు అయ్యగారు లెనిన్ కూడా అదే డేట్ కి వస్తే ఎలా ఉంటుందన్న లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా చరణ్ గచ్చి బౌలి షూట్ లో పాల్గొంటున్నాడన్న  టాక్ వచ్చేసింది. అంటే వచ్చిన గ్యాప్ ని ఇలా చక చక ఫిల్  చేసి అనుకున్న సమయానికి వదులుతాడా ఏంటి అన్న డిస్కషన్ కూడా మొదలైంది. ఏది ఏమైనా అనుకున్న డేట్ కి సినిమాని తీసుకురావడం ఇపుడు పెద్దికి  పెద్ద పరీక్షలాగే ఉంది.డేట్ మిస్ అయితే మాత్రం నెట్టింట చెడుగుడు మాములుగా ఉండదు . చూడాలి మరి ఈ రిలీజ్ టెన్షన్ నుండి పెద్ది ఎప్పుడు రిలాక్స్ అవుతాడో !

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×