E-Paper
Advertisement

Google TV: గూగుల్ టీవీలో జెమినీ ఏఐ.. దిమ్మతిరిగే ఫీచర్లతో పిచ్చెక్కిస్తోంది మామ!

Google TV: గూగుల్ టీవీలో జెమినీ ఏఐ.. దిమ్మతిరిగే ఫీచర్లతో పిచ్చెక్కిస్తోంది మామ!
Advertisement

Google TV: గతేడాది గూగుల్ తన టీవీ ప్లాట్‌ఫామ్‌లో పాత గూగుల్ అసిస్టెంట్ స్థానంలో జెమిని అనే శక్తివంతమైన ఏఐని ప్రవేశపెట్టి పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల టీవీ కేవలం మనల్ని ఎంటర్‌టైన్‌ చేసే పెద్ద డబ్బాలా కాకుండా, మనతో ముచ్చటించే ఓ ఫ్రెండ్‌లా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, కెనడాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఇప్పుడు మరిన్ని కొత్త హంగులతో త్వరలోనే మన ముందుకు వచ్చేస్తోంది.

చూడటమే కాదు.. నేర్చుకోవచ్చు కూడా:

సాధారణంగా మనం టీవీని కేవలం వినోదం కోసమే వాడుతుంటాం. కానీ ఇప్పుడు జెమిని సాయంతో మనకు నచ్చిన విషయాల గురించి లోతుగా తెలుసుకోవచ్చు. మీకు ఎకనామిక్స్ లేదా టెక్నాలజీ గురించి ఏదైనా సందేహం వస్తే.. జెమినీని అడగవచ్చు. అది కేవలం సమాధానం చెప్పడమే కాకుండా, ఒక టీచర్‌లాగా విజువల్స్ సాయంతో స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. అయితే గూగుల్ ఏఐ ఇచ్చే సమాచారం ఎంతవరకు ఖచ్చితంగా ఉంటుందనేది వేచి చూడాలి.

Advertisement

Also Read: ఏం లుక్ మావా ఇది.. ఐఫోన్ 18 ప్రో బర్గండీ కలర్ లీక్, చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

కళ్లకు కట్టినట్లు సమాధానాలు:

గతంలో ఏదైనా అడిగితే కేవలం టెక్స్ట్ రూపంలో సమాధానాలు వచ్చేవి. కానీ ఇప్పుడు జెమిని ఇచ్చే రిజల్ట్స్ చాలా కలర్‌ఫుల్‌గా, విజువల్స్‌తో కనిపిస్తాయి. మీకు ఏదైనా వంటకం కావాలని అడిగితే, దానికి సంబంధించిన వీడియో ట్యుటోరియల్‌ను నేరుగా స్క్రీన్ మీద చూపిస్తుంది. అలాగే ఏదైనా మ్యాచ్ స్కోర్ అడిగితే, లైవ్ స్కోర్ కార్డ్‌తో పాటు ఆ మ్యాచ్ ఏ యాప్‌లో స్ట్రీమ్ అవుతుందో కూడా ఇట్టే చెప్పేస్తుంది. దీనివల్ల రిమోట్‌తో వెతుక్కునే పని తప్పుతుంది.

స్పోర్ట్స్ అప్‌డేట్స్ ఇక చిటికెలో:

Advertisement

క్రీడాభిమానుల కోసం గూగుల్ ‘స్పోర్ట్స్ బ్రీఫ్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఒకవేళ మీరు బిజీగా ఉండి మ్యాచ్‌లు చూడలేకపోయినా, జెమినిని అడిగితే లేటెస్ట్ స్కోర్లు, హైలైట్స్ అన్నీ కలిపి ఒక చిన్న సమ్మరీలా ఇస్తుంది. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్ వంటి గేమ్స్ ఫాలో అయ్యేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వార్తల కోసం ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేకుండానే తాజా అప్‌డేట్స్ అన్నీ టీవీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి.

త్వరలోనే అందుబాటులోకి:

ప్రస్తుతానికి ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అమెరికా, కెనడాల్లోని గూగుల్ టీవీ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా వీటిని విస్తరించనున్నారు. ఏఐ పట్ల కాస్త సందేహాలు ఉన్నప్పటికీ, రోజువారీ పనులను సులభతరం చేసే ఇలాంటి ఫీచర్లు టీవీ చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీ టీవీని స్మార్ట్ నుంచి మరింత ఇంటెలిజెంట్‌గా మార్చే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది.

Also Read: మస్కిటో బ్యాట్‌ను టీవీ దగ్గర పెడుతున్నారా? అయితే, మీరు కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×