RC16 Training: టాలీవుడ్ ‘మెగా పవర్ స్టార్’ నుంచి ‘గ్లోబల్ స్టార్’గా ఎదిగిన రామ్ చరణ్, ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. ‘RRR’ వంటి అంతర్జాతీయ విజయం తర్వాత ఆయన చేసే ప్రతి అడుగుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ (RC16) చిత్రం కోసం చరణ్ పడుతున్న శ్రమ చూస్తుంటే, ప్రేక్షకులకు మరో వెండితెర అద్భుతం ఖాయమనిపిస్తోంది. ఇటీవల ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో మల్ల యుద్ధం నేర్చుకోవడానికి తాను ఎంత కష్టపడ్డడో వివరించారు. ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న శారీరక మార్పులు, పాటిస్తున్న క్రమశిక్షణ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
Read also-అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు రామ్ చరణ్ ఎలా మేనేజ్ చేస్తారో తెలుసా?..
‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఒక శక్తివంతమైన మల్లయోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆయన ఏకంగా ఏడాదిన్నర కాలంగా సిద్ధమవుతున్నారు. కేవలం జిమ్‌లో కసరత్తులు చేయడమే కాకుండా, అసలైన కుస్తీ యోధుడి బాడీ లాంగ్వేజ్ కోసం ‘దంగల్’, ‘సుల్తాన్’ వంటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన నేషనల్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. గత నాలుగు ఐదు నెలలుగా ప్రత్యేకంగా ‘అఖారా’ శిక్షణలో పాల్గొంటూ, మల్లయుద్ధంలోని మెళకువలను క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ చరణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “క్రమశిక్షణ తప్పితే నా మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది” అని ఆయన పేర్కొన్నారు. షూటింగ్ సెట్‌కు సకాలంలో వెళ్లడం నుంచి, ఆహార నియమాలు, వ్యాయామం వరకు ప్రతి విషయంలోనూ ఆయన రాజీ పడకుండా ఉంటున్నారు. ఈ నిబద్ధత కేవలం సినిమా విజయం కోసమే కాకుండా, తన వ్యక్తిత్వంలో భాగమైపోయిందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
Read also-Venu Thottempudi: ఆ నటితో నటించడానికి నిరాకరించిన హీరో వేణు.. అసలేమైందంటే?
చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవడంలో చరణ్ ఎప్పుడూ ముందుంటారు. ‘పెద్ది’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గద పట్టుకుని, కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్న చరణ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ గద పట్టుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదని, దాని బరువును నియంత్రించడమే ఒక పెద్ద సవాల్ అని ఆయన స్వయంగా వెల్లడించారు.
సినిమా అంటే కేవలం కెమెరా ముందుకు వచ్చి నటించడం మాత్రమే కాదు, ఆ పాత్రగా మారడం అని రామ్ చరణ్ నిరూపిస్తున్నారు. ‘పెద్ది’ చిత్రం కోసం ఆయన చూపిస్తున్న ఈ అంకితభావం, క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. కేవలం తన అభిమానులనే కాకుండా, సాధారణ ప్రేక్షకులను కూడా అలరించేలా చరణ్ తనను తాను మలచుకుంటున్న తీరు నిజంగా అభినందనీయం. గ్లోబల్ స్టార్‌గా తన బాధ్యతను గుర్తిస్తూ, భారతీయ సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించేందుకు ‘పెద్ది’ సిద్ధమవుతోంది.