E-Paper
Advertisement

జీవన్ రెడ్డి జంపింగ్‌పై పొలిటికల్ సర్కిల్స్‌లో సెటైర్లు.. కాలం కలిసొచ్చేనా..!

జీవన్ రెడ్డి జంపింగ్‌పై పొలిటికల్ సర్కిల్స్‌లో సెటైర్లు.. కాలం కలిసొచ్చేనా..!
Advertisement

Party Switching: అన్ని రకాలుగా ఆదరించిన పార్టీలో.. ఏదో ఒకసారి ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి.. గోడ దూకేస్తుంటారు కొందరు నేతలు. తమ పార్టీ పవర్‌లోకి రాకపోతే, అధికార హోదా కోసం ప్లేట్ మార్చేస్తారు ఇంకొందరు, అయితే ఇంతకాలం తమను అంత గౌరవంగా చూసుకున్న పార్టీలో ఉన్న గౌరవం వారికి పార్టీ మారాక దక్కుతుందా అంటే గ్యారెంటీ లేదు. అవతల పార్టీలో చేరాక కాని వారికి అర్ధం కాదు తమ పరిస్థితి ఏంటో.. సాదరంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న వారు ఎంత సీనియర్‌ని అయినా కూరలో కరివేపాకులా ఎలా పక్కన పడేస్తారో అన్నదానికి బోల్డు ఉదాహరణలు కనిపిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత గులాబీ కండువాలు కప్పుకున్న కొందరు కాంగ్రెస్ సీనియర్ల పరిస్థితి అలాగే తయారైంది. కారెక్కిన కొందరైతే రాజకీయంగా అనామకులు అయిపోయారు. ప్రస్తుతం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం చూస్తూ అందరూ పాత కథలు గుర్తుకు తెచ్చుకుంటున్నారంట.

పొలిటికల్‌గా సైలెంట్..

ఉన్న పార్టీలో ప్రయారిటీ తగ్గిపోయిందని కొందరు, సొంత వ్యవహారాలు చక్కపెట్టుకోవడానికి అధికారం కావాలి కాబట్టి, ఆ హోదా కోసం ఇంకొందరు జంప్ జిలానీ పాలిటిక్స్ చేస్తుంటారు. రాజకీయాలన్నాక అవన్నీ కామనే. అయితే అంతకాలం తిట్టిపోసిన అవతల పార్టీలో చేరిన తర్వాత కానీ తెలిసి రాదు కొందరికి వారిచ్చే మర్యాద ఏ పాటి ఉంటుందో. సడన్‌గా ప్లేటు ఫిరాయించి పార్టీ ఫిరాయించే నేతలకు కొత్త పార్టీలో చేరాక అవమానాలు ఎదురైనా గత్యంతరం లేక కుక్కిన పేనుల్లో అక్కడే పడి ఉంటారు. కాస్తో కూస్తో ఇగో ఉన్నవారైతే, సొంత గూటికి చేరలేక, వేరే ప్రత్యామ్నాయం కాన రాక పొలిటికల్‌గా సైలెంట్ అయిపోతుంటారు.

టీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు..

Advertisement

దీర్ఘ కాలం తమను ఆదరించిన పార్టీని తిట్టిపోసి, ప్రత్యర్ధి పార్టీల్లో చేరిన వారు పలువురు అక్కడ ఎదురయ్యే పరిణామాలతో పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటారు. అలాంటి వారు గులాబీ పార్టీలో చాలా మందే కనిపిస్తుంటారు. ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు పొలిటికల్ పార్టీగా మారిన టీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో రాజకీయ అనుభవమున్న నేతలు పెద్దగా కనిపించే వారు కాదు. ఆ లోటు పూడ్చుకోవడానికి కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీల్లో సీనియర్లకి ఎర వేసి తమ పార్టీలో కలిపేసుకున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మరీ గులాబీ కండువాలు కప్పారు.

కేసీఆర్‌కు జై..

కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించి, దిగ్గజ నేతలుగా ఫోకస్ అయిన వారు కూడా తమదైన లెక్కలతో కారు పార్టీలో చేరారు. డీఎస్, పొన్నాల లక్ష్మయ్య, కేకే లాంటి వాళ్లు అసలు పార్టీ మారతారని ఎవరూ అనుకుని ఉండరు. తమకు రాజకీయ జీవితాన్నిచ్చన కాంగ్రెస్‌ను వీడతారని ఊహించలేదు. అప్పటి పరిస్థితులు, అధికారం తదితర కారణాలతో అలాంటి కీలక నేతల హస్తం పార్టీని వీడి కారెక్కారు. కేసీఆర్‌కు జై కొట్టారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం, వాక్ స్వాంతంత్రం కేసీఆర్ లాంటి నేత అన్నీ తానై నడిపిస్తున్న పార్టీలో ఉండదని ఆ సీనియర్లకు అనతికాలంలోనే బోధపడింది. గులాబీ పార్టీలో పేరుకి పదవులు, హోదాలు ఇచ్చినా, కాంగ్రెస్‌తో పొల్చుకుంటే టీఆర్ఎస్‌లో తమ పరిస్థితి బేరీజు వేసుకుంటే వారికి తత్వం బోధపడింది.

Advertisement

Also Read: గ్యాస్ మాఫియా పై సర్కార్ సీరియస్.. కొటిన్నర విలువైన సిలిండర్లు సీజ్!

పాపం పొన్నాల లక్ష్మయ్య

దాంతో కేకే, డీఎస్‌లు తిరిగి కాంగ్రెస్ పంచకు చేరారు. పాపం పొన్నాల లక్ష్మయ్య రాజకీయంగా అనామకులై పోయారు. అలాగే అలాంటి ఉదంతాలపై చర్చ జరిగినప్పుడు టీఆర్ఎస్‌లో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంటారు. అప్పు వైఎస్ హయాంలో చేవెళ్ల చెల్లమ్మగా ఆమెకు లభించిన గౌరవం ఏంటి? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ దగ్గర ఆ సీనియర్ మహిళా నేతకు లభిస్తున్న ప్రచారిటీ ఎంత? అని సెటైర్లు పేలుతూనే ఉంటాయి.

జీవన్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్..

ఆ క్రమంలో కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం పెనకేసుకుని, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం గులాబీ పార్టీని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు ఆ పెద్దాయన. తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైనా, జీవన్ రెడ్డి కేసీఆర్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సరికి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చినా ఓటమిపాలయ్యారు.ఉన్న ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో అన్నీ అనుభవించిన ఆయన సడన్‌గా తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఫీలవుతూ తల్లి లాంటి పార్టీని తిట్టిపోసి.. గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు.

దేవుడిచ్చిన వరం అంటా..

ఆయన అధికారికంగా చేరకముందే బీఆర్ఎస్ ముఖ్యనేతలు జీవన్‌రెడ్డికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనని పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి అధినేత కేసీఆర్ కలవడం చకచకా జరిగిపోయాయి. దాంతో తబ్బిబ్బు అయిపోయిన జీవన్ రెడ్డి.. కేసీఆర్‌తో పనిచేసే భాగ్యం దక్కడం దేవుడిచ్చిన వరమని అంటున్నారు. అయితే గులాబీ బాస్ నైజం తెలిసిన వారు మాత్రం.. పాత ఎపిసోడ్లు గుర్తు చేసుకుంటూ పాపం జీవన్ రెడ్డి అని తెగ జాలి పడిపోతున్నారంట.

జీవన్‌రెడ్డి వ్వవహారం..

అప్పట్లో కేకే, డీఎస్‌లు గులాబీ పార్టీని వీడి కొంతలో కొంత గౌరవం కాపాడుకున్నారంటున్నారు. ఇప్పుడు జీవన్‌రెడ్డి వ్వవహారం చూస్తూ, ఇప్పటివరకు అనేక పార్టీలు తిరిగి, తమ రాజకీయ ప్రస్థానం ముగిసే సమయానికి బిఆర్ఎస్ లో చేరుతున్నారన్న సెటైర్లు పేలుస్తున్నారు. బీఆర్ఎస్ వృద్ధ నాయకులకు షెల్టర్ జోన్‌గా మారిపోయిందన్న కామెంట్లు చేస్తున్నారు. మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఇప్పుడు చేరబోతున్న జీవన్ రెడ్డిని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మరి చూడాలి లేటు వయస్సులో పార్టీ మారడానికి రెడీ అయిన జీవన్‌రెడ్డి భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందో.

Storey By: Appa Rao Bih Tv 

Also Read: Illu Illaalu Pillalu : ఏంటి.. ఇది నిజమా.. వేదవతిని అందుకే తీసేశారా..?

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×