E-Paper
Advertisement

Ramcharan Upasana: మెగా ట్విన్స్ రాక.. ఎలిఫెంట్ థీమ్ తో అదిరిపోయే గిఫ్ట్.. క్రేజీగా ప్లాన్ చేసిన చరణ్ ఉపాసన!

Ramcharan Upasana: మెగా ట్విన్స్ రాక.. ఎలిఫెంట్ థీమ్ తో అదిరిపోయే గిఫ్ట్.. క్రేజీగా ప్లాన్ చేసిన చరణ్ ఉపాసన!
Advertisement

Ram Charan Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ఉపాసన (Upasana)దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఉపాసన తన రెండో సంతానంలో భాగంగా కవల పిల్లలకు జన్మనిచ్చారు ఇందులో ఒక అమ్మాయి అబ్బాయి కావటం విశేషం. ఇలా మెగా ట్విన్స్ జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మెగా వారసుడు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది అభిమానులు రామ్ చరణ్ ఉపాసన పేరుతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు గిఫ్ట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా తమకు కవల పిల్లలు జన్మించడంతో కొంతమంది మీడియా ప్రతినిధులకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది.

మీడియా ప్రతినిధులకు స్పెషల్ గిఫ్ట్స్..

ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు మీడియా ప్రతినిధులకు ఇచ్చిన కానుకులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ గిఫ్ట్ హ్యాంపర్ మొత్తం ఎలిఫెంట్ థీమ్ తో ఉండటం విశేషం. ఇక ఈ గిఫ్ట్ హ్యాంపర్ చరణ్ ఉపాసనల పెద్ద కుమార్తె క్లీన్ కారా(Klin Kara) పేరుతో ఇవ్వడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ గిఫ్ట్ హ్యాంపర్‌లో చిరంజీవి తల్లి అంజనా దేవి, ఉపాసన తాతలు, సుచరిత మరియు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, చరణ్ తల్లిదండ్రులు, సురేఖ చిరంజీవి దంపతులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు అనిల్ శోభన ఆశీస్సులతో పంపించినట్ల ఒక నోట్ కూడా రాసి ఉంది.

క్లీన్ కారా పేరుతో గిఫ్ట్ హ్యాంపర్ ..

Advertisement

ఈ కార్డులో “క్లిన్ కారా కొణిదెలకు ఒక తమ్ముడు, చెల్లెలు జన్మించారనే విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము” అని రాసి ఉంది అలాగే ఈ కవల పిల్లలు జన్మించిన 31 జనవరి తేదీతో సంతకం చేయబడింది. ఇక చివరిగా తమ కుటుంబం పట్ల అందించిన ప్రేమ ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రాంచరణ్ ఉపాసన పేరుతో ఈ గిఫ్ట్ హ్యాంపర్ పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదటి సంతానంగా క్లీన్ కారా..

Advertisement

మరి ఈ గిఫ్ట్ హ్యాంపర్ లో ఏముందనేది తెలియదు కానీ ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఎంతో చూడముచ్చటగా ఉండడంతో అభిమానులు కూడా ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఉపాసన రాంచరణ్ 2012వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. ఈ దంపతులకు 2023వ సంవత్సరంలో మొదటి సంతానంలో భాగంగా క్లీన్ కారా జన్మించారు. ఈ చిన్నారి జన్మించిన రెండు సంవత్సరాలకు ఉపాసన మరోసారి కవల పిల్లలకు జన్మనివ్వటం విశేషం. ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లి తండ్రులుగా మారారు.

Also Read: Peddi film Release: ఇట్స్ అఫీషియల్.. ‘ రిలీజ్’ డేట్ ఫిక్స్.. పోస్టర్ వైరల్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×