E-Paper
Advertisement

Dead People Fat: డెడ్ బాడీలనూ వదలని అమ్మాయిలు.. శవాల కొవ్వును, శరీరాల్లోకి ఎక్కించుకొని..

Dead People Fat: డెడ్ బాడీలనూ వదలని అమ్మాయిలు.. శవాల కొవ్వును, శరీరాల్లోకి ఎక్కించుకొని..
Advertisement

కొంతమంది అమ్మాయిలు తమ అందం కోసం ఏమైనా చేస్తారు. తమ ముఖం నుంచి బాడీ వరకు ప్రతి పార్టు ప్రత్యేకంగా కనిపించాలనే తపనతో ఈ మధ్య ఇంకా ఏవేవో చేసేస్తున్నారు. తాజాగా అమెరికాలో బయపడిన ఓ రహస్య ట్రీట్మెంట్.. ప్రపంచాన్నే నోరు వెళ్లబెట్టేలా చేసింది. చనిపోయిన వ్యక్తుల నుంచి కొవ్వును సేకరించి.. దాన్ని అమ్మాయిలకు ఇంజెక్ట్ చేస్తున్నారట. ఛీ, ఇదేం పాడు పనులు అని అనుకుంటున్నారా? అయితే, అది ఒక సరికొత్త కాస్మోటిక్ ట్రెండ్.

శవాల కొవ్వును ఏం చేసుకుంటారు?

సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడం కోసం ఈ మధ్య అమ్మాయిలు తమ షేపులు మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ బ్రెస్ట్‌, బట్స్ చేయించుకుంటున్నారు. అయితే, వాటిని సింథటిక్‌తో తయారు చేస్తారు. వాటి వల్ల భవిష్యత్తులో సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ట్రెండ్ మొదలైంది. శవాల నుంచి సేకరించిన కొవ్వును.. రొమ్ములు, పిరుదుల సైజు పెంచే ఫిల్లర్స్‌లా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువనే ప్రచారం మొదలు కావడంతో డిమాండ్ కూడా పెరిగింది. కానీ, అది కూడా అంత సేఫ్ కాదని తెలుసుకోలేకపోతున్నారు.

రూ.40 లక్షలకు పైనే..

Advertisement

అమెరికాకు చెందిన టైగర్ ఎస్తెటిక్స్ అనే కంపెనీ.. AlloClae పేరుతో ఈ ప్రొడెక్టును అందుబాటులోకి తెచ్చింది. అయితే, దీని ధర తక్కువేమీ కాదు. మాన్‌హాటన్‌కు చెందిన 34 ఏళ్ల మహిళ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా హిప్స్, పిరుదుల ఫిల్లింగ్ కోసం రూ.40 లక్షలు వరకు ఖర్చయ్యింది. ఆ ఫిల్లర్స్‌ను డెడ్ బాడీల కొవ్వు నుంచి తయారు చేస్తారని తెలుసు. అది నైతికంగా సేకరించినదే అని భావిస్తున్నా. దానితో ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్పు అనిపించలేదు’’ అని పేర్కొంది.

ఒకప్పుడు మెడికల్ ప్రాక్టీస్‌కు, ఇప్పుడు..

వాస్తవానికి శవాల నుంచి సేకరించే కొవ్వులను కేవలం మెడికల్ ప్రాక్టిస్ కోసమే ఉపయోగించేవారు. కానీ, ఇప్పడు దాన్ని శుద్ధి చేసి.. ఇలా సౌందర్య ఉత్పత్తులు, సర్జరీల కోసం ఉపయోగిస్తు్న్నారు. చాలామంది తమ శరీరాలను మెడికల్ కాలేజీలకు దానమిస్తుంటారు. ఆ డెడ్ బాడీల నుంచి సేకరించిన కొవ్వును ప్యూరిఫై చేస్తారు. ఆ తర్వాత కణరహిత కొవ్వులుగా మారుస్తారు. రోగ నిరోధక ప్రతిస్పందన నిరోధించడం కోసం ఆ కొవ్వులో ఉండే డీఎన్ఏ, సజీవ కణాలను పూర్తిగా తొలగిస్తారు.

ఎవరికి ఉపయోగిస్తారు?

Advertisement

ఇలా శుద్ధి చేసిన కొవ్వును చాలారకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బక్కగా ఉన్న వ్యక్తులకు లేదా లైపోసక్షన్ చేయించుకున్నవారికి ఇంజెక్ట్ చేస్తారు. అలాగే బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ (BBL) ప్రక్రియకు కూడా ఈ కొవ్వునే ఉపయోగిస్తున్నారు. ఈ కొవ్వును శరీరంలోకి చేర్చడానికి ప్రత్యేకంగా సర్జరీలు అవసరం లేదు. జస్ట్ ఇంజెక్ట్ చేస్తే చాలు. మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి పెద్దగా సమయం పట్టదు. గంట లోపులోనే మొత్తం ప్రక్రియ ముగుస్తుందని ప్లాస్టిక్ సర్జన్లు చెబుతున్నారు.

ఖర్చుతో కూడిన ప్రమాదం

ఇలాంటి కొవ్వులను శరీరంలోకి ఎక్కించడం సులభమైన పనే. కానీ, ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే కొవ్వుల పరిమాణం బట్టి ఈ ధరలు ఉంటాయి. రూ.9 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇది సక్సెస్ అయితే లక్కీయే. ఫెయిలైతే మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ కొవ్వులను రక్త నాళాలలోకి సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోతే ఫ్యాట్ ఎంబాలిజం (Fat Embolism) ఏర్పడే ప్రమాదం ఉంది. అంటే ఈ కొవ్వు కణాలు.. రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుని అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. రొమ్ము కణజాలాల్లోకి జీవపదార్థమైన కొవ్వును ఇంజెక్ట్ చేయడం వల్ల మైక్రోకాల్సిఫికేషన్‌లు ఏర్పడతాయని, దాని వల్ల క్యాన్సర్ కణాలను కనుగోవడం కష్టం అవుతుదని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి శరీర దానం చేసేది.. ప్రాణాల రక్షించే ఔషదాల తయారీకి అవసరమైన ప్రయోగాల కోసం. కానీ, అమ్మాయిలు తమ అందాలను పెంచుకొనేందుకు కాదు. మరి, ఇది నైతికత ఎలా అవుతుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

Also Read: వీడెవడండి బాబు.. ఏకంగా బాంబునే ‘అక్కడ’ పెట్టుకున్నాడు, అది చూసి డాక్టర్లు.. పరుగులు

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×