E-Paper
Advertisement

Peddi Movie: మెగాఫాన్స్ కి ఊహించని షాక్.. పెద్ది ఇప్పట్లో లేనట్టే?  మళ్లీ వాయిదా..

Peddi Movie: మెగాఫాన్స్ కి ఊహించని షాక్.. పెద్ది ఇప్పట్లో లేనట్టే?  మళ్లీ వాయిదా..
Advertisement

Peddi Movie: మెగా అభిమానులు రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో రామ్ చరణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతుంది. ఈ నేపథ్యంలోనే
చరణ్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan)ఇటీవల శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో చరణ్ అభిమానులు పెద్ది సినిమా(Peddi Film) పైన ఆశలు పెట్టుకున్నారు.

మళ్లీ వాయిదా పడుతున్న రామ్ చరణ్ పెద్ది..

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని ముందుగా మార్చి 27 తేదీ విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చిన విధంగానే ఈ సినిమాని మార్చి 27 నుంచి ఏప్రిల్ 30 తేదీకి వాయిదా వేశారు. షూటింగ్ పూర్తి కానీ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది.

ఏప్రిల్ 30 వ తేదీ పై కన్నేసిన స్వయంభు..

Advertisement

ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వడానికి మరింత సమయం పడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవని సమాచారం. ఇలా పెద్ది సినిమా ఏప్రిల్ 30 వ తేదీ వాయిదా పడుతుందంటూ వార్తలు రావడంతో ఈ తేదీన నిఖిల్ స్వయంభు సినిమాని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా పెద్ది సినిమా మళ్లీ వాయిదా పడుతోంది అంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్..

Advertisement

ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడితే తదుపరి సినిమా ఎప్పుడు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. పెద్ది సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ సినిమా మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో నిరాశ చెందుతున్నారు ఇక ఈ సినిమాపై మాత్రం భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ అలాగే ఫస్ట్ సింగిల్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా కుషిత కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఇందులో జగపతిబాబు వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: SSS Film Release: శివాజీ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని రిలీజ్ డేట్ ఫిక్స్..ఆ రోజే థియేటర్లలోకి..

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×