E-Paper
Advertisement

Ambati Rambabu Release: నన్ను చంపేందుకు ప్ర‌యత్నించారు.. వెనక్కి తగ్గేది లేదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu Release: నన్ను చంపేందుకు ప్ర‌యత్నించారు.. వెనక్కి తగ్గేది లేదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Ambati Rambabu Release:మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుమారు ఏడు గంటల పాటు తన ఇంటిపై సాగిన దాడిలో భార్యాబిడ్డలను తీవ్రంగా వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. తనను భౌతికంగా హతమార్చేందుకు ప్రయత్నించినప్పటికీ భయపడేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. వీటన్నింటికీ దేవుడే తగిన సమాధానం చెబుతాడంటూ ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తన కష్టసమయంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అంబటి రాంబాబు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే ఆయన అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు అక్రమ కేసులకు దాడులకు భయపడరని వైఎస్‌ జగన్ నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.

Advertisement

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అంబటి ఇంటిపై దాడి చేసి జైల్లో పెట్టారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు కోసమే తనకు అధికారం దక్కిందని భావిస్తున్నారని మండిపడ్డారు. అంబటి మనోధైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీయలేకపోయిందని న్యాయం వైపు ఉన్న తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధిస్తోందని ధ్వజమెత్తారు. అంబటి క్షమాపణ చెప్పినా ఆయన ఇంటిని ముట్టడించి ధ్వంసం చేయడం మహిళలను భయాందోళనకు గురిచేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం తెస్తున్నారని విమర్శించిన ఆమె అధికార గర్వంతో వ్యవహరిస్తున్న వారికి ప్రజలు తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు.

Advertisement

Read Also: హనీ ట్రాప్ అని నిరూపిస్తే నన్ను చంపేయండి.. హర్షవీణ మరో సెల్ఫీ వీడియో

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×