E-Paper
Advertisement

Andhra King thaluka: ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

Andhra King thaluka: ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
Advertisement

Andhra King thaluka: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాక్లెట్ బాయ్ గా.. మాస్ హీరోగా పేరు సొంతం చేసుకున్న హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri borse) హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య నవంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ కి సంబంధించి ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ డేట్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

విషయంలోకి వెళ్తే.. నవంబర్ 28న థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో నవంబర్ 18 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ విషయానికి వస్తే.. మెట్లపై నుండి ఒక చేత్తో సైకిల్ ఎత్తుకొని.. మరొక చేతితో బటన్స్ ఓపెన్ చేసిన షర్టు అంచు పట్టుకొని నవ్వుతూ అలా మెట్లు దిగివస్తున్నట్లు పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో రామ్ తన అద్భుతమైన లుక్కుతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఒక అభిమాని పాత్రలో రామ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తో ఎలా ఆకట్టుకుంటుంది? సినిమాపై బజ్ ఎలా క్రియేట్ చేస్తుంది తెలియాలి అంటే నవంబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే.

ఈ చిత్రంతో టాలెంట్ ను బయట పెట్టనున్న రామ్..

Advertisement

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే.. మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, ఉపేంద్ర , వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తనలోని మరో యాంగిల్ ని కూడా చూపించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదల చేయగా.. మొదటి పాటకు లిరిక్స్ అందించిన ఈయన.. రెండవ పాటను స్వయంగా ఆలపించి తనలోని రచయితను, సింగర్ ను అభిమానులకు పరిచయం చేశారు. ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ తో కలిసి పాల్గొన్న రామ్.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమాతో నైనా రామ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

also read:i Bomma: ఒక్కడు కాదు సమూహం.. ఏకంగా 70 కి పైగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి!

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరో రామ్..

Advertisement

ప్రముఖ హీరోగా పేరు సొంతం చేసుకున్న రామ్.. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న రామ్.. ఆ తర్వాత లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను చేస్తూ.. లవర్ బాయ్గా పేరు సొంతం చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మారిపోయిన ఈయన.. ఆ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్, డబుల్ ఇస్మార్ట్ అంటూ పలు చిత్రాలు చేశారు కానీ అన్నీ కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. అందుకే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×