i Bomma:ఎన్నో సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ, బప్పంల ద్వారా ఆన్లైన్లో లీక్ చేస్తూ ఐ బొమ్మా అనే వెబ్సైట్ తో పాటు కొన్ని వెబ్ సైట్స్ నడుపుతూ నిర్మాతల పొట్ట కొడుతున్న ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.. కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన మొదటి రోజే ఐ బొమ్మలో ప్రత్యక్షం అయ్యేవి. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లే బదులు ఇలా ఆన్లైన్ ద్వారానే ఇంట్లో నుండి ఫోన్లో సినిమా చూడవచ్చు అని చాలామంది ఐ బొమ్మ నుండి డౌన్లోడ్ చేసుకొని సినిమా చూసేవారు. దీనివల్ల నిర్మాతలు వేలకోట్లు నష్టపోయారు. ఇక ఐ బొమ్మ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించిన నిర్మాతలు పోలీసులను ఆశ్రయించగా.. సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ సైట్ ని మూసివేయాలని కోరారు.. కానీ ఐ బొమ్మని నడిపే ఇమ్మడి రవి మాత్రం దమ్ముంటే నన్ను అరెస్టు చేయండని పోలీసులకే సవాల్ విసిరారు.
ఇక పోలీసులకు సవాల్ విసిరితే వారు ఊరుకుంటారా..వెంటనే ఇమ్మడి రవిని కాపుకాసి మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా ఫైనల్ గా పోలీసుల అదుపులో ఉన్న రవిని ఆయనతోనే ఐ బొమ్మ సైట్ ని బ్లాక్ చేయించారు. అయితే ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నుండి తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆయన గురించి కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇమ్మడి రవి కూకట్ పల్లిలోని అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు చేయగా..ఆ అపార్ట్మెంట్లో వందలకొద్దీ హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, లాప్ ట్యాప్ లతో పాటు 3 కోట్ల నగదు కూడా దొరికిందట.
అయితే ఇమ్మడి రవిని విశాఖపట్నం కి చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్ గా పోలీసులు గుర్తించారు. ఆయన ఎంత కట్టుదిట్టమైన వెబ్సైట్స్ అయినా సరే హ్యాక్ చేయగల నేర్పరట. ఎంత సెక్యూరిటీగా ఉన్నా సరే చాలా ఈజీగా హ్యాక్ చేస్తారట. అంతే కాదు తన టాలెంట్ తో కొత్త కొత్త సినిమాలను భద్రపరిచే క్లౌడ్ ఫైర్ ని కూడా హ్యాక్ చేశారు. అలా క్లౌడ్ ఫైర్ ని హ్యాక్ చేసి కొత్త కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకొని కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడ నుండే సినిమాలను ఐ బొమ్మ వెబ్సైట్లో పెడుతున్నారు.
అంతేకాదు ఇమ్మడి రవి ఐ బొమ్మ పేరుతో దాదాపు 70కి పైగా మిర్రర్ సైట్లను నడిపిస్తున్నారట. ఇమ్మడి రవికి దేశవ్యాప్తంగా మంచి నెట్వర్క్ ఉండడంతో పాటు దేనినైనా సరే ఈజీగా హ్యాక్ చేసే నైపుణ్యం ఉందని తెలిసి పోలీసుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా నిర్మాతలు తమ సినిమా హక్కులను డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ కి అందజేసే సమయంలో..లేదా రిలీజ్ చేసే సమయంలో ఆ సంస్థలు థియేటర్ల నుండి సాటిలైట్ కి చేరవేసే క్రమంలో వాటిని ఇమ్మడి రవి హ్యాక్ చేస్తూ తన సైట్లో పెట్టేవారట. అంతేకాదు ఇమ్మడి రవి కొన్ని రోజులు ఈ కార్యకలాపాలను వైజాగ్ లోని MVP కాలనీ సెక్టార్ 7 లోని తన ఇంటి నుండి కూడా నడిపించారట. కానీ సెప్టెంబర్ 29న తన అనుచరులు అయినటువంటి ప్రశాంత్, శివాజీ లను పోలీసులు అరెస్టు చేయడంతో అప్పటివరకు హైదరాబాదులోనే ఉన్న ఈయన సడన్గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ALSO READ:Big Tv Kissik Talks: ఆ రోజు నుంచి ఆయనపై పిచ్చి పెరిగిపోతోంది.. జ్యోతి ఊహించని కామెంట్స్!
అలా నెదర్ల్యాండ్, ఫ్రాన్స్,కరేబియన్ దీవులు ఇలా పలు దేశాలు తిరుగుతూ IP అడ్రస్ లను మార్చుకుంటూ ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా కొత్త సినిమాలను పెడుతూ వచ్చాడు.కానీ భార్యతో విడాకుల కోసం నెదర్లాండ్ నుండి హైదరాబాద్ కి చేరుకునే క్రమంలో ఈ విషయం తెలుసుకున్న భార్య వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇమ్మడి రవి అడ్డంగా దొరికిపోయాడు. మొత్తానికైతే ఒక్కడు కాదు ఒక సమూహాన్నే నడిపిన ఈయన భార్య కారణంగా దొరికిపోయాడు. అలా సినీ ఇండస్ట్రీకి వేలకోట్ల నష్టం కలిగించిన భారీ తిమింగలాన్ని పోలీసులు పట్టుకున్నారు.