E-Paper
Advertisement

Varanasi : వారణాసి ట్రైలర్ పై రామ్ పోతినేని రియాక్షన్

Varanasi : వారణాసి ట్రైలర్ పై రామ్ పోతినేని రియాక్షన్
Advertisement

Varanasi : ఎక్కడ విన్నా కూడా ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి సినిమా గురించే టాక్ వినిపిస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి ఆ సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి రంగంలోకి దిగారు. అందుకే వారణాసి సినిమా వరల్డ్ ఎలా ఉండబోతుందో చూపించడానికి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ చూసిన తర్వాత సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన అవగాహన వచ్చేసింది.

ముఖ్యంగా వారణాసి సినిమాకి సంబంధించిన వరల్డ్ ఎస్ఎస్ రాజమౌళి పరిచయం చేసిన తర్వాత బయట చాలా డిస్కషన్స్ మొదలయ్యాయి. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే మన పురాణాలు గురించి ఇతిహాసాల గురించి దేవుల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. కల్కి సినిమా తరువాత చాలామంది ఈ సినిమా గురించి డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. రిలీజ్ చేసిన వీడియోలో చిన్న మస్తా దేవి టాపిక్ కూడా చర్చనీయాంశం అయింది.

వారణాసి ట్రైలర్ పై రామ్ రియాక్షన్ 

Advertisement

అయితే కొంతమంది సెలబ్రిటీలకు కూడా సినిమాల మీద విపరీతమైన క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్లు చేస్తున్న సినిమాలతో పాటు మిగతా హీరోలు చేస్తున్న సినిమాలను కూడా తరచు చూస్తూ ఉంటారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. బాహుబలి వన్ మరియు బాహుబలి 2 సినిమాలు రెండు కలిపి బాహుబలి ఎపిక్ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా విపరీతంగా రామ్ పోతినేనికి నచ్చిందట. ఇంతకుముందు రెండు సినిమాలు కూడా నచ్చాయి కానీ ఇలా చూడటం కూడా నాకు విపరీతంగా నచ్చింది అంటూ చెప్పారు. అలానే వారణాసి సినిమా ట్రైలర్ కూడా తనకు విపరీతంగా నచ్చినట్లు రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివిల్ చేశాడు రామ్ పోతినేని.

ఆంధ్ర కింగ్ కం బ్యాక్ 

Advertisement

మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా సినిమా మీద విపరీతమైన నమ్మకాలను పెంచుతుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. అయితే రామ్ ఆశలన్నీ కూడా ఈ సినిమా నిలబెడుతుంది అని బలంగా నమ్ముతున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రామ్ తనలోని ఉన్న అన్ని టాలెంట్ ను ఈ సినిమా కోసం బయటపెట్టేసాడు. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Also Read: Telusu Kada : దొంగలించిన కథకు 50 కోట్లు పెట్టుబడి, రచయిత జీవితం నాశనం, తెలుసు కదా వెనుక అసలు కథ

 

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×