Telusu Kada : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే కొంతమంది అన్నిటిని కూడా డిస్కస్ చేయరు. టికెట్ రేట్లు పెరగటం. పైరసీలు జరగటం ఇవే అసలైన సమస్యలు అని అనుకుంటారు. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగే కథల దొంగతనాన్ని గురించి మాట్లాడే వాళ్ళు అతి తక్కువ మంది. ఎన్నో కలలతో ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపు సాధించుకోవాలి అని కొంతమంది వస్తుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి.
ఇలాంటి ఉదాహరణలు చెప్పడానికి కోకొల్లలు. చాలామంది తమ కథలను కొంతమందికి చెప్పడంతోనే తమ జీవితంలోకి మంచి రోజులు వచ్చేసాయి అని కాబోయే దర్శకులు ఫీల్ అవుతుంటారు. కానీ అక్కడే అసలైన సమస్యలు మొదలవుతాయి అని ఎవరు ఊహించరు. చాలామంది ఒక ఆలోచనను నిర్మాతలకు, నటులకు చెప్పినప్పుడు అది అంతగా బాలేదు, దానిని డెవలప్ చెయ్ అని చెబుతూ ఉంటారు. ఒక టైం దాటిన తర్వాత ఆ కథ చెప్పిన వ్యక్తికి ఎవరు అందుబాటులో ఉండరు.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన సినిమా తెలుసు కదా. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది.
ఈ తరుణంలో ఆన్లైన్ లో ఈ సినిమా గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఐడియా 2020లో ఒక వ్యక్తి సమంతకు చెప్పారట. కథను చెప్పిన వెంటనే తనకు పాత్ర కూడా విపరీతంగా నచ్చింది అని చెప్పారట సమంత. అయితే కొన్ని సంవత్సరాలు టైం కావాలి అని అడిగారట. అప్పటికే సమంతకు స్టైలిష్ చేస్తున్న నీరజ కోనాకి కూడా ఇదే లైన్ షేర్ చేశాడు ఆ వ్యక్తి.
ఫిమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ను మెయిల్ ఓరియెంటెడ్ గా మార్చి మూడు సంవత్సరాలు టైం తీసుకుని నీరజకోన దానిని అలా డెవలప్ చేసినట్లు ఆరోపణలు చేశాడు. అలానే చాటింగ్స్ కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్ లు కూడా షేర్ చేశారు. అయితే అది సమంత నెంబర్ కాదా అనే క్లారిటీ లేదు.
Also Read: Dhanush Mrunal : ధనుష్ మృణాల్ రిలేషన్ నిజమేనా? పోస్టులు వెనుక ఆంతర్యం ఏంటి?
అయితే ఈ టాపిక్ అంతటినీ కూడా ఒక వ్యక్తి ఆన్లైన్ లో షేర్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఫ్రెండ్ కి ఇలా జరిగింది అని వివరించాడు. ఇదంతా జరిగిన తర్వాత కొంతమంది రియాక్షన్ ఏంటంటే సినిమా విడుదల అయిపోయింది. ఓటీటీ లో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా అవసరమా అని అంటున్నారు.
ఈ సినిమా విషయానికి వస్తే దాదాపు 50 కోట్లు ఖర్చుపెట్టిన ఈ సినిమా దగ్గరగా 35 కోట్ల వరకు నష్టం చేసింది. సిద్దు కెరీర్ కి ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుంది అని అందరూ ఊహించరు. కానీ సినిమా మాత్రం ఊహించని రేంజ్ లో బెడిసి కొట్టింది.
Disclaimer: All claims mentioned above are subject to online discussions and circulating rumors. This article does neither verify nor assert the factuality of these charges.
Idea Theft in Tollywood – Real Story behind “Telusu Kada”
byu/Street_Scarcity9951 intollywood