E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది క్లైమాక్స్ లో సంచలన ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

Peddi Movie: పెద్ది క్లైమాక్స్ లో సంచలన ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
Advertisement

Peddi Movie:రామ్ చరణ్ (Ram Charan).. గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన తర్వాత ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar ) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్ ‘ సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాగైనా సరే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న రామ్ చరణ్ ‘ఉప్పెన’ సినిమాతో ఊహించని స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. టికెట్ ధరల పెంపు కోసం ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. భారీ అంచనాల మధ్య ఊహించని కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పెద్ది మూవీ.

పాటలతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పెద్ది..

ఇప్పటికే ఈ సినిమా నుండి “చికిరి చికిరి”,” రై రై” అంటూ వచ్చిన పాటలు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అతి తక్కువ సమయంలోనే ఊహించని మిలియన్ వ్యూస్ ను, లైక్స్ ను సాధించి రికార్డు సృష్టించాయి. మరోవైపు ఈ సినిమాకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచేలా గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం బుచ్చి బాబు సనా , రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులు ఒప్పుకుంటారా? అనే కామెంట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:Nayanthara: సీనియర్ స్టార్స్ కి కేరాఫ్ అడ్రస్.. మరో స్టార్ హీరో సరసన అవకాశం!

పెద్ది కోసం ఊహించని క్లైమాక్స్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది సినిమా క్లైమాక్స్ లో గేమ్ కోసం చివరికి రామ్ చరణ్ ప్రాణాలు త్యాగం చేసే ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ను తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ను డిజైన్ చేశారట. ఈ క్లైమాక్స్ కి రాంచరణ్, చిరంజీవి కూడా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై విశ్లేషణ జరుపుతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే సినిమా ప్రేక్షకులు జీర్ణించుకుంటారా ? అసలు ఫ్యాన్స్ స్పందన ఏంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతే.. దాదాపు ఆ సినిమా డిజాస్టర్ గానే నిలిచిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో చిత్రాల క్లైమాక్స్ లో హీరో చనిపోవడంతో డిజాస్టర్ గానే నిలిచాయి.

ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

Advertisement

అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో అదే సీన్ రిపీట్ అయితే అసలు ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా క్లైమాక్స్ లో నిజంగానే రామ్ చరణ్ పాత్ర చనిపోయి.. ఈ సినిమా హిట్ కొట్టిందంటే మాత్రం ఆ సెంటిమెంట్ కి ఈ సినిమా బ్రేక్ వేసినట్లే అని కూడా చెప్పవచ్చు. మరి చూద్దాం ఈ సినిమా క్లైమాక్స్ కోసం రామ్ చరణ్, బుచ్చిబాబు ఏ విధంగా ప్లాన్ చేశారో.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×