E-Paper
Advertisement

డెకాయిట్ పై పెద్ది ప్రశంశలు…బాగా ఎంజాయ్ చేసానంటూ పోస్ట్!

డెకాయిట్ పై పెద్ది ప్రశంశలు…బాగా ఎంజాయ్ చేసానంటూ పోస్ట్!
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan)తన సినిమా పనులలో బిజీగా ఉన్నప్పటికీ ఇతర హీరోల సినిమాలపై కూడా ఈయన స్పందిస్తూ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టులు చేస్తుంటారు. ఇటీవల శర్వానంద్ బైకర్ సినిమా చూడకుండానే ఈ సినిమా పట్ల వస్తున్న ఆదరణ చూసి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.తాజాగా అడివి శేష్, (Adivi Sesh)మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన డెకాయిట్(Dacoit) సినిమా పట్ల కూడా రామ్ చరణ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

శేష్ నటన చాలాకాలం గుర్తుండిపోతుంది..

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ డెకాయిట్ సినిమా గురించి పోస్ట్ చేస్తూ.. ఇప్పుడే తాను డెకాయిట్ సినిమా చూశాను ఈ సినిమా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. హరి పాత్రలో శేష్ తన నటనతో మరో లెవెల్ కి తీసుకెళ్లారు. హరి పాత్రలో శేష్ నటన చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని తెలిపారు. ఇక నటి మృణాళ్ ఠాకూర్ విషయానికి వస్తే ఈమె తన పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమాకు ఆమె నటనే ఒక పెద్ద అసెట్ అంటూ చరణ్ ప్రశంసించారు. మృణాళ్ ఠాకూర్ శేష్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఇతర నటీనటులు కూడా అద్భుతమైన నటనను కనబరిచారని చరణ్ తెలిపారు.

నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదు..

Advertisement

ఇక ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే సుప్రియ యార్లగడ్డపై కూడా చరణ్ ప్రశంసలు కురిపించారు. సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారని హైటెక్నికల్ వాల్యూస్ తో సినిమాను ప్రజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది అంటూ చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలుపుతూ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ విడుదల కాగా మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతుంది.

Advertisement

ఈ సినిమాకు సినీ సెలబ్రిటీల నుంచి మంచి పాజిటివ్ స్పందన రావడంతో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగాయి. శేష్ కెరీర్ లోనే ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇలా శేష్ డెకాయిట్ సినిమా కోసం ముందు నుంచి స్టార్ హీరోలు ఎంతో మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాచురల్ స్టార్ నాని సైతం మేజర్ సినిమా కంటే కూడా డెకాయిట్ చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా స్పందించడంతో సినిమా పట్ల మరింత బజ్ ఏర్పడిందని చెప్పాలి. చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: పవన్ కళ్యాణ్ OG2 కి అదిరిపోయే టైటిల్… పిచ్చెక్కిస్తున్న సుజీత్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×