E-Paper
Advertisement

ప్రాణహాని ఉంది, రక్షించండి.. హైదరాబాద్‌లో మలయాళీ నటి సజిని ఫిర్యాదు

ప్రాణహాని ఉంది, రక్షించండి.. హైదరాబాద్‌లో మలయాళీ నటి సజిని ఫిర్యాదు
Advertisement

Tollywood:సినిమా సెలబ్రిటీలకు ఈ మధ్యకాలంలో బెదిరింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. కొంతమందికి బాంబు బెదిరింపులు వస్తే.. మరికొంతమందికి హత్యా బెదిరింపులు రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు వారి నివాసాలకు బాంబు బెదిరింపులు రాగా ఇప్పుడు మరొక నటి ఏకంగా ప్రాణహాని ఉంది రక్షించండి అంటూ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. మరి ఆమె ఎవరు? ఎవరి నుంచి ఈమెకు ప్రాణహాని ఉంది? అసలు ఏ విషయంలో ఈ బెదిరింపులు వస్తున్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ప్రాణహాని ఉంది, రక్షించండి -మలయాళ నటి

ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళీ నటి సజిని. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బి గ్రేడ్ సినిమాలతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. అప్పట్లో ప్రముఖ నటి షకీలాతో కలిసి పలు చిత్రాలలో నటించింది. అలాంటి ఈమె తాజాగా తనకు ప్రాణహాని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదా పంచాయితీలో తనపై ఎవరో దాడి చేసినట్టు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. “నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను రక్షించండి” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది సజిని. ఇకపోతే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆస్తి తగాదాలలో ఇప్పుడు తనకు ప్రాణహాని ఉంది అంటూ అందులోను ఒక మలయాళ నటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. త్వరలోనే దీనిపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

సజిని బ్యాక్ గ్రౌండ్..

Advertisement

మలయాళం చిత్ర పరిశ్రమలో సాఫ్ట్ కోర్, బీ గ్రేడ్ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు. ఇటు తెలుగు సినిమాలలో నటిస్తుండగానే అటు మలయాళం లో కూడా అవకాశాలు రావడంతో ప్రముఖ నటి షకీలాతో కలిసి పలు చిత్రాలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇకపోతే తెలుగు , మలయాళం లోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలు చేసి తన నటనతో అబ్బురపరిచింది. తరచుగా గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సజిని.. 2000 దశాబ్దం ప్రారంభంలో వచ్చిన చిత్రాలకు మరింత పాపులారిటీ అందుకుంది .. “రజినీ చిత్రాలుగా” పిలవబడే సినిమాలలో షకీలాతో కలిసి ఎక్కువగా పనిచేసింది.

also read:అందుకే జబర్దస్త్ మానేశా.. ఇన్నాళ్లకు నిజాలు బయటపెట్టిన గెటప్ శ్రీను?

సజిని సినిమాలు..

Advertisement

సజిని నటించిన సినిమాల విషయానికొస్తే 2001లో డ్రైవింగ్ స్కూల్ సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత నాళం సింహం, కల్లువాతుక్కల్ కత్రినా, కనవు వంటి చిత్రాలలో నటించింది . ఇకపోతే ఈమధ్య కాలంలో ఎక్కువగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈమె.. కొన్నిసార్లు తన పేరును దేవి అని కూడా పరిచయం చేసుకుంది. ఇక 2018లో టిడిపి పార్టీకి పనిచేయడమే కాకుండా రాజకీయ కార్యకలాపాలలో కూడా పాలుపంచుకుంది.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×