E-Paper
Advertisement

పెద్ది రిలీజ్ డేట్ కన్ఫర్మ్… అఖిల్ సినిమా మళ్ళీ వాయిదా వేయాల్సిందేనా?

పెద్ది రిలీజ్ డేట్ కన్ఫర్మ్… అఖిల్ సినిమా మళ్ళీ వాయిదా వేయాల్సిందేనా?
Advertisement

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదల విషయంలో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇలా మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీకి వాయిదా పడిన ఈ సినిమా ఖచ్చితంగా విడుదలవుతుందని అందరూ భావించారు కానీ ఇంకా ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేశారు. ఇలా మరోసారి ఈ సినిమా వాయిదా వేస్తూ చిత్ర నిర్మాతలు తెలియజేయడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు.

జూన్ 25న రాబోతున్న పెద్ది?

ఏప్రిల్ 30వ తేదీ నుంచి వాయిదా పడిన ఈ సినిమా తిరిగి జూన్ లో విడుదలవుతుందని నిర్మాతలు తెలియజేశారు. కానీ ఖచ్చితమైన తేదీ ప్రకటించకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీ పై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జూన్ నాలుగో తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ అదే రోజున యశ్ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపత్యంలోనే జూన్ 25వ తేదీ పెద్ది విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

లెనిన్ వాయిదా వేసుకోవాల్సిందేనా..

Advertisement

ఇప్పటికే ఈ సినిమా విడుదల గురించి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని, అతి త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 25వ తేదీ కనుక విడుదల అయితే మరోసారి అఖిల్ అక్కినేని లెనిన్(Lenin) సినిమా వాయిదా వేసుకోవాల్సి వస్తుందని చెప్పాలి. మే 1వ తేదీ లెనిన్ విడుదల కావాల్సి ఉండగా ఏప్రిల్ 30వ తేదీ పెద్ది విడుదల కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో లెనిన్ వాయిదా వేసుకుని జూన్ 26 తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు పెద్ది సినిమా వాయిదా పడి జూన్ 25 న విడుదలకు సిద్ధం కావడంతో మరోసారి లెనిన్ వాయిదా పడక తప్పదనే తెలుస్తుంది.

స్పెషల్ సాంగ్ లో శృతిహాసన్..

Advertisement

ఇలా రామ్ చరణ్ కోసం అఖిల్ సినిమాని తరచు వాయిదా వేస్తున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే కేవలం ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందంటూ ఇటీవల షూట్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉందనీ, ఈ స్పెషల్ సాంగ్ పూర్తి అయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి చివరికి శృతిహాసన్ ఫిక్స్ అయ్యారని ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని సమాచారం.

Also Read: కొరటాల శివ బాలయ్య సినిమాకు పూజ ముహూర్తం పిక్స్.. షూటింగ్ డీటెయిల్స్ ఇవే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×