E-Paper
Advertisement

Ramgopal Varma: ఐ బొమ్మ రవి పై వర్మ కామెంట్స్.. రాబిన్ హుడ్ రవి అంటూ !

Ramgopal Varma: ఐ బొమ్మ రవి పై వర్మ కామెంట్స్.. రాబిన్ హుడ్ రవి అంటూ !
Advertisement

Ram gopal Varma: మూవీ పైరసీ కింగ్ ఐబొమ్మ (IBomma)నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi) ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలను పైరసీ చేస్తూ భారీగా ఆస్తులు సంపాదించిన ఈయన పోలీసులకు దొరికిపోవడంతో ఈయనకు రిమాండ్ విధించారు. ఇలా రవి పోలీసులకు దొరకడంతో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు రవి గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. అయితే తాజాగా సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సైతం సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన ట్వీట్ వేస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

రాబిన్ హుడ్..

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ రవిని ఏకంగా రాబిన్ హుడ్(Robin Hood) తో పోల్చారు. ఇక మూవీ పైరసీ గురించి ఈయన మాట్లాడుతూ పైరసీ ఎప్పటికీ ఆగదు టెక్నాలజీ చాలా బాగా అభివృద్ధి చెందింది లేదా పోలీసు వ్యవస్థ బలహీనంగా మారినందుకు కాదు. ఇలా పైరసీలో సినిమా చూడటానికి ప్రేక్షకులు ఉన్నంతవరకు ఇలాంటి వారికి రవి లాంటి వారు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటారని తెలిపారు. ఇక్కడ హాస్యాస్పదమైన అంశం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా రవికి ఎంతోమంది మద్దతు తెలియజేస్తూ ఆయనని రాబిడ్ హుడ్ తో పోలుస్తున్నారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రాబిన్ హుడ్ హీరో కాదు.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రికార్డు చేయబడిన ఉగ్రవాది రాబిన్ హుడ్ అని తెలిపారు.

సామాజిక పతనానికి కారణం..

Advertisement

రాబిన్ హుడ్ లేనివారికి ఇవ్వటం కోసం ఉన్న వారిని దోచుకుంటారు. అదే రీతిలో రవి వ్యవహార శైలి ఉందని తెలిపారు. సినిమా టికెట్ల రేట్లు, పాప్ కార్న్ ధర ఎక్కువైనప్పుడు సినిమా పైరసీలకు పాల్పడుతుందని చెబుతున్నారు. ఈ ప్రకారం ఒక కారు ఖరీదైనది అయితే షోరూమ్ మొత్తం దొంగలించుకోవాలి, నగలు ఖరీదైతే నగల దుకాణం మొత్తం దొంగలించి పంపిణీ చేయాలి. ఇలాంటి ఆలోచన సామాజిక పతనానికి కారణమవుతుందని తెలిపారు. అయితే చాలామంది పైరసీలో సినిమా చూడటం అనేది డబ్బు ఆదా అవుతుందని చూడవచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని ఒక లింక్ పై క్లిక్ చేస్తే సినిమా చూడొచ్చని భావనలో ఉంటారు.

Advertisement

ఇలాంటి సమస్యకు పరిష్కారం రావాలి అంటే రవి లాంటి వారిని అరెస్టు చేయటం కాదు.. ఎవరైతే పైరసీలో సినిమా చూస్తున్నారో అలాంటి వారిని గుర్తించి ఒక వంద మందిని అరెస్టు చేయడమే కాకుండా వారి పేర్లను కూడా ప్రచారం చేయాలి. ఇలా ఎవరైతే పైరసీలో సినిమాలు చూస్తున్నారో వారి వివరాలను బయట పెడితే అప్పుడే అందరిలోనూ భయం మొదలవుతుందని తద్వారా ఇలాంటి వాటికి అడ్డుకట్టు వేయొచ్చు అంటూ ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మూవీ పైరసీ గురించి సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, వర్మ చెప్పింది అక్షర సత్యం అని, పైరసీకి అడ్డుకట్టు వేయాలంటే ఇదే సరైన మార్గం అంటూ వర్మ పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు.

Also Read: IBomma Ravi: తప్పు ఒప్పుకున్న ఐ బొమ్మ రవి… విచారణలో ఏం చెప్పాడంటే?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×