E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!
Advertisement

Vijay Deverakonda:రణ బాలి.. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు కొల్లగొడుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరూ కలిసి విజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక తన విజయవాడ టూర్ లో భాగంగా వీరిద్దరితో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్టు మోహన్ యాదవ్ తన ఎక్స్ లో చెప్పడం విశేషం .ఇక ఈ సందర్భంగా మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్లో సినిమా షూటింగ్లోకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు, అమలు చేస్తున్న విధానాల గురించి వారిద్దరికీ వివరించినట్లు చెప్పుకొచ్చారు.దేశంలోని సినిమా షూటింగ్ లకి మధ్యప్రదేశ్ ఒక హాట్ స్పాట్ గా  డెవలప్ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

మామూలుగా పొలిటీషియన్స్ సినీస్టార్స్ ని కలిస్తే అందరి ఫోకస్ అటు వైపే ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కూడా మోహన్ యాదవ్ ని కలవడం ఇపుడునెట్టింట్ వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ రౌడీ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డం సంపాదించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన నటన, సందీప్ వంగా టేకింగ్ ఆడియన్స్ ని కట్టిపడేసాయి .

Advertisement

ఇక ఆ తర్వాత రష్మిక కాంబోలో వచ్చిన గీత గోవిందం సినిమా 100 కోట్లు కొల్లగొట్టడంతో యూత్ లో మరింత క్రేజ్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ .అయితే ఆ తర్వాత వరుసగా డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్, టైగర్ ,ఖుషి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డీలా పడిపోయాడు.ఇక కింగ్డమ్ కూడా అనుకున్న సక్సెస్ కాకపోవడంతో అందరి ఆశలన్నీ రణబాలి పై పెట్టుకున్న పరిస్థితి .ఇక ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఎట్టకేలకు సక్సెస్ బాట పట్టినట్టే కనిపిస్తుంది విజయ్ దేవరకొండ .

ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే కన్నడ నుంచి బాలీవుడ్ లో పాగా వేసిన ఈ బ్యూటీ తొలి సినిమా కిరాక్ పార్టీ అన్న సంఘతి తెలిసిందే. తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టేసి ఒకసారి స్టార్ అయిపోయింది .ఆ తర్వాత గీతాగోవిందం ,సరిలేరు నీకెవ్వరు, భీష్మ పుష్ప వంటి సినిమాల తో ఒక్కసారిగా టాప్ స్టార్ అయిపోయింది.

అలాగే  బాలీవుడ్ లో యానిమల్, చావా వంటి సినిమాలతో మరింత పాపులారిటి కొట్టేసింది.ఇక ఈ క్రష్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటిస్తున్న సంఘతి తెలిసిందే.మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికలు మధ్యప్రదేశ్ సీఎంని కలవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.

https://x.com/bhatti_mallu/status/2111420048523063768?s=48

Tags

Related News

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

Big Stories

Advertisement
×