Rajamouli on Ramayana Movie:దర్శకధీరుడు రాజమౌళి తాజాగా రామాయణం సినిమా గురించి ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామాయణం అనేది ప్రతి భారతీయ దర్శకుడు చిన్నప్పటి నుంచి చెప్పాలని కోరుకునే గొప్ప కథ అని అలాంటి కథను దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోస్తున్నారని ఆకాశానికి ఎత్తేశారు . ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నానని చెబుతూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు.
మొత్తానికి రాజమౌళి ఈ పోస్ట్ పెట్టడంతో రామాయణం సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే రాజమౌళి అంటేనే భారీ సినిమాలు గుర్తుకొస్తాయన్న సంగతి తెల్సిందే. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్న.. ఇప్పుడు రామాయణం సినిమా గురించి మాట్లాడటం అభిమానుల్లో ఆసక్తి పెంచేసింది.
రామాయణం కథ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందికి ఈ కథ తెలీని వారు లేరంటే ఆశ్చర్యం లేదు.అలాంటి సినిమా ఎన్ని సార్లు వచ్చినా ఆడియన్స్ చూడటం విశేషం. ఇక భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ గానే ఉన్నాయి.
దర్శకుడు నితేశ్ తివారీ ‘దంగల్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రెండు వేల కోట్లని కొల్లగొట్టడం విశేషం. అలాగే ‘చిచ్చోరే’ సినిమాతోనూ తన టాలెంట్ ని మరోసారి బయటపెట్టారు . ఇప్పుడు రామాయణం లాంటి గొప్ప కథను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఈ సినిమాని ఏకంగా 4 వేల కోట్ల భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండటంతో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది.ఇక ఈ రామాయణ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో రామాయణం ఆధారంగా ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం నుండి ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ వరకు ఎన్నో సినిమాలు వచ్చి మనల్ని ఎంతగానో అలరించాయి. మరి ఇప్పుడు నితేశ్ తివారీ తీసుకొస్తున్న రామాయణం ఎలాంటి కొత్త అనుభూతిని అందిస్తుందో చూడాలి.మొత్తానికి, రాజమౌళి చేసిన ఈ పోస్ట్తో రామాయణం సినిమాపై ఆసక్తి మరింత పెరిగిందనడం లో సందేహం లేదు. చూడాలి ఈ దీపావళికి రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో !
ALSO READ :విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!