Traffic Challan Scam| ఆన్‌లైన్ మోసాల కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ కోవలో ఇటీవలి కాలంలో అత్యధికంగా నకిలీ ట్రాఫిక్ ఈ చలాన్స్ కేసులు ఉన్నాయి. మోసగాళ్లు ఫేక్ ట్రాఫిక్ ఈ-చలాన్ మెసేజ్‌లు పంపి ప్రజలను మోసం చేస్తున్నారు. పూణేలోని పింప్రీ-చించ్‌వాడ్ ప్రాంతాల్లో ఈ స్కామ్ బాగా పెరిగింది. ఇప్పటికే చాలామంది భారీ మొత్తంలో డబ్బు కోల్పోయారు. డిజిటల్ ట్రాఫిక్ జరిమానాలు చూపించి ప్రజలను మోసగాళ్లు దోచుకుంటున్నారు. ఇదంతా నకలి చలాన్ లింక్‌లు లేదా ఫైల్స్ క్లిక్ చేయడం ద్వారా జరుగుతుంది.
మోసగాళ్లు అధికారిక ట్రాఫిక్ నోటీస్‌లాగా కనిపించే మెసేజ్‌లు పంపుతారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు చెల్లించని జరిమానాలు ఉన్నాయని చెబుతారు. స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నేరాలు చేశారని ఆరోపణలు పెడతారు. పెనాల్టీ లేదా లీగల్ యాక్షన్ వస్తుందని భయపెట్టి యూజర్‌ని భయపడెతారు. మెసేజ్‌తో లింక్ లేదా APK ఫైల్ అటాచ్ చేస్తారు. వెంటనే లింక్ చేయాలని లేదా ఫైల్ డౌన్ లోడ్ చేయమని ఒత్తిడి చేస్తారు.
లింక్ క్లిక్ చేస్తే ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ మాల్‌వేర్ ద్వారా మోసగాళ్లకు మీ ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ లభిస్తుంది. మెసేజ్‌లు చదవడం, ఓటీపీలు ఇంటర్‌సెప్ట్ చేయడం సాధ్యమవుతుంది. బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. వాట్సాప్ అకౌంట్‌ను కూడా కంట్రోల్ చేస్తారు. ఈ తరువాత నిమిషాల్లోనే మీరు డబ్బు కోల్పోతారు.
పూణేలో ఒక వ్యక్తి ఫేక్ ఈ-చలాన్ లింక్ క్లిక్ చేసి రూ.5 లక్షలు కోల్పోయాడు. పింప్రీ-చించ్‌వాడ్‌లో మరొకరు రూ.2 లక్షల కంటే ఎక్కువ నష్టపోయారు. రెండు కేసులూ ఒకేలా జరిగాయి. మోసగాళ్లు ఆర్టీఓ అధికారులుగా ఫోన్ చేసి త్వరగా తాము చెప్పినట్లు చేయమని ఆదేశించారు. యూజర్లు ఆందోళన చెందిన మోసగాళ్లు చెప్పింది నమ్మి ఒప్పించారు.
చాలామంది బాధితులకు వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ వచ్చాయి. “RTO Traffic Challan.apk” లాంటి పేర్లతో ఉంటాయి. చలాన్ డిటెయిల్స్ ఉన్నాయని చెబుతారు. ఇన్‌స్టాల్ చేస్తే పూర్తి ఫోన్ యాక్సెస్ సైబర్ దొంగల చేతుల్లోకి పోతుంది. మీ కాంటాక్ట్స్, ఫోటోలు, ఫైనాన్షియల్ ఇన్ఫో పొందుతారు. వాట్సాప్ ద్వారా ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారు.
ఫోన్ యాక్సెస్ పొందిన తర్వాత కొందరు ఈ-సిమ్ రిక్వెస్ట్ చేస్తారు. రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్ నంబర్ మారుస్తారు. అన్‌ఆథరైజ్డ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేస్తారు. బాధితులు పూర్తిగా తన ఫోన్ పై కంట్రోల్ కోల్పోతారు.
సైబర్ పోలీసుల ప్రకారం.. శుక్రవారం రాత్రి లేదా హాలిడేస్ సమయంలో మెసేజ్‌లు పంపుతారు. ఆ సమయంలో బ్యాంక్ సపోర్ట్ పరిమితంగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయడం కష్టం అవుతుంది.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ లేదా SMS నుంచి APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు. గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్ ఎప్పుడూ యాప్ ఫైల్స్ పంపవు. పరివాహన్ ఈ-చలాన్ పోర్టల్‌లో అధికారికంగా చెక్ చేయాలి. ఈ చలన్ అనుమాస్పదంగా ఉంటే ట్రాఫిక్ పోలీసులతో డైరెక్ట్ గా సంప్రదించడం ఉత్తమం.
Also Read: యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్‌తో ఎన్ని కోట్ల ఆదాయం వస్తుంది? ఇలా లెక్కించాలి
వెంటనే మొబైల్ డేటా, వై-ఫై ఆఫ్ చేయండి. సస్పిషియస్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అవసరమైతే ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. మీ బ్యాంక్ కు కాల్ చేసి ట్రాన్సాక్షన్లు బ్లాక్ చేయించండి. అన్ని ముఖ్యమైన పాస్‌వర్డ్స్ మార్చండి. సైబర్ పోలీసులకు రిపోర్ట్ చేయండి.
స్కామ్ మెసేజ్‌లు వచ్చిన వెంటనే రిపోర్ట్ చేయాలి. త్వరగా కంప్లైంట్ ఇస్తే మోసపూరిత నెట్‌వర్క్‌లను ఆపడం సులభం. అవగాహనతో ఆర్థిక నష్టాలు తప్పుతాయి. ప్రజల సహకారం సైబర్ క్రైమ్‌ను అరికట్టడానికి కీలకం.