Ranveer Vans: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన సినిమాల షూటింగ్ సమయంలో విలాసవంతమైన ఏర్పాట్లు కోరుకుంటారనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. తాజాగా ‘ధురంధర్’ సినిమా సెట్స్‌లో రణవీర్ ఏకంగా ఐదు వానిటీ వ్యాన్‌లను ఉపయోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ అంశంపై ఆయన సహనటుడు గౌరవ్ గేరా, ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ ఆసక్తికరంగా స్పందించారు.
దర్శకురాలు ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్ కోసం నటుడు గౌరవ్ గేరా ఇంటికి వెళ్లినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్’లో రణవీర్, గౌరవ్ కలిసి నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ సరదాగా మాట్లాడుతూ.. “రణవీర్ సింగ్ సెట్స్‌లో ఐదు వ్యాన్‌లు వాడుతున్నాడని విన్నాను” అని గౌరవ్‌ను అడిగారు.
ఫరా వ్యాఖ్యలపై గౌరవ్ గేరా స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. “నేను సెట్స్‌లో రణవీర్ కోసం ఎప్పుడూ ఐదు వ్యాన్‌లను చూడలేదు. ఒకవేళ ఆయన దగ్గర అన్ని ఉన్నా, రణవీర్ లాంటి స్టార్‌కి అవి తక్కువే” అని చమత్కరించారు. రణవీర్ షూటింగ్ సమయంలో చాలా హుషారుగా ఉంటారని, ఇతరులను ఆటపట్టిస్తూ సెట్స్‌లో సందడి నెలకొల్పుతారని ఆయన పేర్కొన్నారు. తన ఫేమస్ ‘చుట్కీ’ పాత్ర డైలాగులను రణవీర్ అనుకరిస్తూ తనను తెగ నవ్వించేవారని గుర్తుచేసుకున్నారు.
Read also-కెరీర్ ప్రారంభంలో హాలీవుడ్ నటికి చేదు అనుభవం.. ఆ పని కోసం..
పుకార్లను పక్కన పెడితే, రణవీర్ సింగ్ పని పట్ల చూపే అంకితభావానికి ఫరా ఖాన్ మద్దతుగా నిలిచారు. “అతను అద్భుతమైన నటుడు. అతనికి ఐదు కాదు, ధురంధర్ సినిమా తర్వాత మరో ఐదు అదనంగా ఇవ్వాలి” అంటూ ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. గతంలో కూడా రణవీర్ తన షూటింగ్ సెట్స్‌లో జిమ్ కోసం ఒకటి, మేకప్ కోసం ఒకటి, విశ్రాంతి కోసం మరొకటి.. ఇలా మూడు వేర్వేరు వ్యాన్‌లు అడుగుతారనే వార్తలు వచ్చాయి. అయితే వీటిపై రణవీర్ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ, అవన్నీ నిరాధారమైన వార్తలని, సమయాన్ని ఆదా చేసేందుకు మాత్రమే అవసరమైన సౌకర్యాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.