E-Paper
Advertisement

The Girl Friend : కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక, అంతలా కదిలిపోయింది ఏంటి?

The Girl Friend : కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక, అంతలా కదిలిపోయింది ఏంటి?
Advertisement

The Girl Friend : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి పేరు సాధించింది రష్మిక. కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఈమెకు మంచి గుర్తింపు ఉంది. రష్మిక స్టోరీస్ సెలక్షన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చలో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తరువాత కాలంలో మంచి కథలను ఎంచుకునే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు.

తను నటించిన పుష్పా సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు 1000 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా కోసం ముందుగా ఒక నటి ను తీసుకొని, పది రోజులు షూటింగ్ చేసిన తర్వాత రిజెక్ట్ చేశాడు సందీప్. ఆ తర్వాత గీతాంజలి అనే పాత్రలో రష్మిక ఒదిగిపోయింది.

కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక 

Advertisement

ఇకపోతే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. రోజులు పెరుగుతున్న కొద్దీ ఈ సినిమాకి ఇంకా ఆదరణ పెరుగుతుంది. ఈ సినిమాలో భూమా దేవి అనే పాత్రలో కనిపించిందే రష్మిక.

రాహుల్ ఈ సినిమాలో భూమా దేవి అనే పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో నీదే నీదే కథ అని ఒక పాట వస్తుంది. ఆ పాట గురించి, ఆ సీన్ లో రష్మిక పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ కి ఆ సీన్ తీసుకెళ్ళిపోయింది.

Advertisement

ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నేడు జరుగుతుంది. ఈ సక్సెస్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు అబ్దుల్ ఈ పాటను పాడారు. అబ్దుల్ ఈ పాటను పాడుతున్న తరుణంలో రష్మిక కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. బాగా ఎమోషన్ కి గురి అయిపోయింది. రష్మిక కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఎంతలా కదిలిపోయిందో అని అర్థమవుతుంది.

విజయ్ చీఫ్ గెస్ట్ 

ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇప్పుడు విజయ్ ఈవెంట్ లో ఏం మాట్లాడుతారో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. గతంలో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పైన ఏమైనా స్పందిస్తారేమో అనే క్యూరియాసిటీ కూడా ఉంది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సినిమా ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత క్రియేట్ చేస్తుందో చూడాలి. సినిమాకి సంబంధించిన వీడియోస్ కూడా ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.

Also Read: Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కామెడీ సినిమా, ఇదెక్కడ ట్విస్ట్ అన్న?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×