E-Paper
Advertisement

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కామెడీ సినిమా, ఇదెక్కడ ట్విస్ట్ అన్న

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కామెడీ సినిమా, ఇదెక్కడ ట్విస్ట్ అన్న
Advertisement

Sandeep Reddy Vanga: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంచలన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. మొదటి సినిమాతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా తక్కువ మంది జీవితంలో జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఆ సినిమాను విపరీతంగా కామెంట్ చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

బాలీవుడ్ మీడియా అంతా కూడా అది ఒక వైలెంట్ ఫిలిం అని కామెంట్ చేశారు. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను అని అనిమల్ తెరకెక్కించాడు. అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అసలైన వైలెంట్ ఫిలిం అనిమల్ అని వాళ్లకు చూపించాడు. ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ లో రివ్యూ వర్స్ టార్గెట్ చేసేటట్లు, ఒక సీన్ కూడా డిజైన్ చేశాడు. అది ఏ ఇంటెన్షన్ తో సందీప్ పెట్టాడో తెలియదు కానీ చాలామంది మాత్రం రివ్యూ వర్స్ అని అప్లై చేసేసారు.

కామెడీ సినిమా 

Advertisement

సందీప్ సినిమాలు ఎంత సీరియస్ గా ఉంటాయో కొన్ని సినిమాలు చూస్తే అర్థమయిపోతుంది. సందీప్ సినిమాలో నటులు ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందుకే సీన్ కు కూడా ఒక హై ఫీల్ వస్తుంది. సందీప్ రెడ్డి లైన్ అప్ దాదాపు ఒక నాలుగు సంవత్సరాలకు సరిపడా ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోతో భారీ హైప్ క్రియేట్ చేశాడు వంగ.

Advertisement

ఇకపోతే సందీప్ రెడ్డి వంగ ఒక కామెడీ సినిమా చేయబోతున్నట్లు జిగిరి సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే సందీప్ నుంచి కామెడీ సినిమా ఎవరు ఊహించి ఉండరు. ఒకవేళ చేస్తే ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. అయితే ఆ సినిమా చేయడానికి చాలా టైం పడుతుంది అని కూడా చెప్పాడు.

జిగ్రీస్ టీమ్ తో ఏం చెప్పాడు 

జిగ్రీస్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తరుణంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్ర యూనిట్ సందీప్ రెడ్డి వంగను కలిశారు. వాళ్లు మాట్లాడుతూ అన్నా మీరు కామెడీ చాలా బాగా చేస్తారట. ఒక పది సంవత్సరాల క్రితం మీరు చెప్పిన జోక్స్ కి విపరీతంగా పడి పడి నవ్వారట కొంతమంది. వాళ్ల జీవితంలో ఎప్పుడు అంతలా నవ్వలేదట. నుంచి కామెడీ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా.

అంతలా నవ్వే కామెడీ ఏం చెప్పానో అని నాకే గుర్తు రావడంలేదు. నేను కామెడీ సినిమా ఖచ్చితంగా చేస్తాను. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. అంటూ సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

Also Read: The Paradise : కేవలం 3 గంటలే నిద్ర, టార్గెట్ ఫిక్స్ చేశారు

Related News

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

Big Stories

Advertisement
×