E-Paper
Advertisement

పెళ్లయినా.. విజయ్ రష్మిక కోరిక తీర్చలేదా?

పెళ్లయినా.. విజయ్ రష్మిక కోరిక తీర్చలేదా?
Advertisement

Rashmika Mandanna:టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం తమ లేటెస్ట్ మూవీ ‘రణబాలి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ క్రేజీ జంట, సినిమా ప్రమోషన్లలో భాగంగా బతుకమ్మ సంరాలకు అతిధులుగా విచ్చేసారు ..ఇక అక్కడ కాసేపు సరదాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రష్మిక తన భర్త విజయ్‌పై చేసిన ఒక క్యూట్ కంప్లైంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం..

సినిమాతో పాటు రియల్ లైఫ్‌లోనూ చర్చ:

విజయ్, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ హైలైట్‌గా నిలవగా, అందులో ‘నల్లపూసల’ చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక కేవలం రీస్రీన్ మీదే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ నల్లపూసల టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

also read:జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

నల్లపూసల కోసం ఇంకా వెయిటింగ్:

ఫ్యాన్స్‌తో ముచ్చటించే సమయంలో ఒక అభిమాని విజయ్, రష్మికలను నల్లపూసల గురించి సరదాగా ప్రశ్నించారు. వెంటనే స్పందించిన రష్మిక.. “విజయ్ నాకు ఇంకా నల్లపూసలు కొనియ్యలేదు.. నేను దానికోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాను” అంటూ అందరి ముందు క్యూట్‌గా కంప్లైంట్ చేసింది. ఇక రష్మిక మాటలకు అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.

నేనే అన్ని నగలు కొనిచ్చాను: విజయ్:

Advertisement

రష్మిక చేసిన ఈ కామెంట్పై విజయ్ దేవరకొండ వెంటనే స్పందిస్తూ.. “పెళ్లికి కావలసిన అన్ని రకాల నగలను నేనే స్వయంగా కొనిచ్చాను” అని చెప్పుకొచ్చాడు. అయితే మధ్యలో రష్మిక కలుగజేసుకుంటూ.. “అవును, మా అత్తయ్య, మా అమ్మ అందరూ కలిసి నాకు నల్లపూసలు ఇచ్చారు.. కానీ మా ఆయన విజయ్ మాత్రం నాకు కొనివ్వలేదు” అంటూ మరోసారి సరదాగా నవ్వించారు. ఇక వీరిద్దరి మధ్య సాగిన ఈ క్యూట్ సంభాషణ నెటిజళ్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ సునామీ: ‘రణబాలి’ సినిమా దసరా పండగ అడ్వాంటేజ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన ఐదో రోజు కూడా పండగ సెలవుల ప్రభావంతో అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులతో సినిమా అద్భుతమైన ట్రెండ్ కనబరుస్తోంది. మేజర్ సెంటర్లలో ఏకంగా తొలి రోజు రేంజ్‌కు సరిసమానంగా కలెక్షన్లు వస్తుండటం విశేషం. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా జోరు చూపించడంతో,నిన్న ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 4.5 కోట్ల నుంచి రూ. 5 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టినట్టు సమాచారం.

ఇక మొత్తానికి చూస్తే, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ విజయ్, రష్మికల మధ్య ఉండే ఈ బాండింగ్, చిన్న చిన్న సరదా గొడవలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ‘రణబాలి’ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ జంట, తమ పర్సనల్ లైఫ్ కబుర్లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు!

Related News

జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

రావు రమేష్ కి సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం ఏంటంటే?

అనడానికి ఏం అర్హత ఉంది.. బాడీ షేమింగ్ ట్రోల్స్ పై పాయల్ స్ట్రాంగ్ కౌంటర్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!

చిన్న కూతురి పేరు రివీల్ చేసిన దీపిక పదుకొనె… ఫోటో వైరల్!

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×