Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలలో జైలర్ చిత్రం ఒకటి. ఈ సినిమాకి కొనసాగింపు వచ్చిన జైలర్ 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరుస కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది.. పైగా ఈ సినిమాలో భారీ తారాగణం కీలక పాత్రలు పోషించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని కొన్ని పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. జైలర్ 2 సినిమాలో విలన్ శర్వాకల్పక్ పాత్ర అందరి దృష్టిని ఆకట్టుకుంది . ముఖ్యంగా ఇందులో అసలైన విలనిజం కనబరిచి అందరిలో అటెన్షన్ క్రియేట్ చేశారు . పైగా ఈ పాత్రలో నటించిన ఆయన భార్య కూడా ఒక హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి జైలర్ టు లో విలన్ గా శర్వా కల్పక్ పాత్ర పోషించింది ఎవరు? ఆయన భార్య ఎవరు? ఆమె ఏ సినిమాలలో నటించింది? 0 అనే విషయం వైరల్ గా మారింది.
శర్వా కల్ప పాత్ర పోషించిన హకీం షాజహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. తొలిసారి ఏబిసిడి:అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి అనే చిత్రం ద్వారా 2013లో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో కడశీలి అనే సినిమాలో కీలక పాత్ర పోషించి, తమిళ ప్రేక్షకులను పలకరించిన ఈయన బిర్యానీ, అర్చన 31 నాట్ అవుట్, ప్రణయ విలాసం, మిరాజ్ వంటి చిత్రాలలో నటించి కీలక పాత్రలు పోషించారు. చివరిగా ఐ నోబడి అనే చిత్రంలో నటించిన ఈయన ఇప్పుడు జైలర్ 2 చిత్రంలో శర్వా కల్పక్ పాత్రలో అద్భుతమైన నటన కనపరిచి మెప్పించారు.
ఇకపోతే హకీం షాజహాన్ భార్య కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ఆమె ఎవరో కాదు కేరళ కొచ్చికి చెందిన సన అల్తాఫ్. ఈమె కూడా ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొచ్చిలోని భవన్ ఆదర్శ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు టీవీ హోస్ట్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత విక్రమాదిత్యన్ అనే చిత్రంలో దుల్కర్ సల్మాన్ సోదరి పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ సరసన మరియం ముక్కు అనే చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత రాణి పద్మిని చిత్రంలో ఒక ట్రెక్కర్ గా కనిపించిన ఈమె.. పలు తమిళ చిత్రాలలో సోదరీ పాత్రలతో కూడా ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె కూడా చివరిగా ఐ నోబడి చిత్రంలో తన భర్తతో పాటూ నటించి ఆకట్టుకుంది.
ఇక వీరిద్దరి పెళ్లి విషయానికి వస్తే.. వీళ్లిద్దరూ 2024లో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది ఈ జంట.