E-Paper
Advertisement

Rashmika mandanna: రికార్డ్ సృష్టించిన రష్మిక.. కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ!

Rashmika mandanna: రికార్డ్ సృష్టించిన రష్మిక.. కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ!
Advertisement

Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి ఏకంగా 23 మిలియన్ల లైక్స్ సాధించి భారత్‌లోనే అత్యధిక లైక్స్ పొందిన పోస్ట్‌గా రికార్డుకెక్కాయి. ఇప్పటివరకు క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ కప్ విన్నింగ్ పోస్ట్ రికార్డును రష్మిక అధిగమించడం విశేషం. వెండితెరపైనే కాదు, సోషల్ మీడియాలోనూ ఆమె క్రేజ్ మామూలుగా లేదని ఈ రికార్డ్ నిరూపించింది. ఆ వివరాలు చూద్దాం..

కింగ్ కోహ్లీ రికార్డును దాటేసిన జయమ్మ:

సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ టాప్ లో ఉండేవారు. ముఖ్యంగా T 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆయన పెట్టిన పోస్ట్‌కు 22.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన పోస్ట్‌గా అది ఇప్పటివరకు నిలిచింది. కానీ, విజయ్ దేవరకొండతో జరిగిన తన పెళ్లి ఫోటోలను రష్మిక పోస్ట్ చేయగానే అభిమానులు లైక్స్‌తో ముంచెత్తారు. పెళ్లి డ్రెస్ లో వున్నా ఈ జంట ఫొటోస్ క్షణాల్లోనే ఆ మార్కును దాటేసి, ఏకంగా 23 మిలియన్ల మార్కును చేరుకుని రష్మిక ఇన్‌స్టా క్వీన్‌గా అవతరించేలా చేసాయి. ఇక కోహ్లీ పేరిట ఉన్న ఐపీఎల్ విజయం (19.8M), రిటైర్మెంట్ పోస్ట్ (19.7M) రికార్డులు కూడా ఇప్పుడు రష్మిక జోరు ముందు వెలవెలబోతున్నాయి.

విరోష్ పెళ్లి ఫొటోలకు నెటిజన్ల నీరాజనం:

Advertisement

విరోష్ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు, ఆ వివాహ ఫోటోలు ఒక పండుగలా అనిపించాయి. అందుకే ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా, లైక్ల సునామీని సృష్టిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీల పోస్ట్‌లకు ఇంత స్థాయిలో స్పందన రావడం ఇదే మొదటిసారి. ‘రణబాలి’ సినిమాలో విజయ్ పక్కన జయమ్మగా నటిస్తున్న రష్మిక, రియల్ లైఫ్‌లో పెళ్లికూతురిగా మెరిసిపోవడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ నుంచి సౌత్ వరకు అన్ని భాషల అభిమానులు ఈ పోస్ట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సోషల్ మీడియాలో రష్మిక క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే:

ఇక రష్మిక కేవలం నటిగానే కాకుండా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ తన సత్తా చాటుతున్నారు. గతంలోనే సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిన రష్మిక, ఇప్పుడు ఏకంగా స్పోర్ట్స్ ఐకాన్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. ఇక వరుస పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు ఈ పెళ్లి హడావిడి తో రష్మిక పేరు మార్మోగిపోతోంది. సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్న ‘రణబాలి’ సినిమాకు ఈ సోషల్ మీడియా రికార్డ్ ఒక భారీ బూస్ట్‌లా పనికొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రికార్డును భవిష్యత్తులో మళ్ళి ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.

Advertisement

 

also read: Ranabali: విరోష్ జంటకు రణబాలి నుండి స్పెషల్ సర్ప్రైజ్.. ఏందయ్యా స్వామి అంటూ!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×