E-Paper
Advertisement

Lava Bold N2 Offers: రూ.6,999కే ప్రీమియం లుక్.. ఆండ్రాయిడ్ 15తో వచ్చిన లావా కొత్త ఫోన్ విశేషాలివే!

Lava Bold N2 Offers: రూ.6,999కే ప్రీమియం లుక్.. ఆండ్రాయిడ్ 15తో వచ్చిన లావా కొత్త ఫోన్ విశేషాలివే!
Advertisement

Lava Bold N2 Offers: సామాన్యులకు సైతం అత్యాధునిక ఫీచర్లను చేరువ చేయడంలో దేశీయ దిగ్గజం లావా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ సంస్థ నుంచి Lava Bold N2 మార్కెట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. స్టైలిష్ లుక్, బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను కోరుకునే బడ్జెట్ యూజర్ల కోసం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. రూ.7,499 లాంచ్ ధరతో వచ్చిన ఈ ఫోన్.. ఇప్పుడు ప్రత్యేక ఆఫర్ కింద కేవలం రూ.6,999కే లభిస్తోంది. గ్లోసీ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్‌తో వచ్చిన ఈ ఫోన్‌ని చూడగానే వినియోగదారులు ఫిదా అవ్వడం ఖాయం.

కలర్ ఆప్షన్స్:

ఈ Lava Bold N2 స్మార్ట్‌ఫోన్.. 6.75 అంగుళాల భారీ HD+ స్క్రీన్‌తో వస్తుంది. దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా మూవీ లవర్స్, రీల్స్ స్క్రోలింగ్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. కేవలం 8.5 మిమీ మందంతో చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Advertisement

Also Read: ఈ రింగ్ వేలికి పెట్టుకుంటే చాలు.. మీ బాడీలో ఏం జరుగుతుందో చిటికెలో చెప్పేస్తుంది!

మెరుగైన పనితీరు:

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించడం వల్ల మల్టీటాస్కింగ్‌‌కు చక్కగా సెట్ అవుతుంది. అలాగే 4GB RAMకు అదనంగా మరో 4GB వర్చువల్ RAMను జోడించారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 (గో ఎడిషన్) సాఫ్ట్‌వేర్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా సాఫీగా నడుస్తుంది. 64GB ఇన్‌బిల్ట్ మెమరీని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. మంచి క్వాలిటీ ఫొటోలు తీయడానికి 13MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇంటి వద్దే ఫ్రీ సర్వీస్:

Advertisement

రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అమర్చారు. అలాగే IP64 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి తుంపర్ల నుండి ఫోన్‌కు రక్షణ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. లావా అందిస్తున్న ఏడాదిపాటు వారంటీ, ఇంటి వద్దే ఫ్రీ సర్వీస్ సౌకర్యం వినియోగదారులకు మరింత భరోసానిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కావాలనుకునే వాళ్లు ఈ ఫోన్‌ను ఇప్పుడే కొనేయొచ్చు.

Also Read: లక్ష రూపాయల ఫోన్ సగం ధరకే.. మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై కళ్లుచెదిరే ఆఫర్!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×