Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో కాదు అంతకుమించి నటనతో ఊహించని స్టార్డంను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని రికార్డులను కొల్లగొట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా పుష్ప , పుష్ప2, యానిమల్ , ఛావ, ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్ అంటూ మూడు సంవత్సరాలలోనే మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ క్వీన్ గా నిలిచింది రష్మిక మందన్న. అంతేకాదు ఇటీవల వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి గానూ ఉత్తమ మహిళా నటిగా గద్దర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
అలా ఒకవైపు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. మరొకవైపు తాను ప్రేమించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో ఎట్టకేలకు ఏడడుగులు వేసింది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట ఎనిమిదేళ్లపాటు రహస్యంగా తమ బంధాన్ని కొనసాగించారు. ఈ బంధాన్ని బయట పెట్టాలని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు కూడా కోరారు. కానీ ఎక్కడ ఈ జంట ఓపెన్ అవ్వలేదు. ఇక దాంతో విరోష్ అంటూ ఈ జంటకి అభిమానులు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుచుకుంటూ వచ్చారు. ఇక అభిమానులు పెట్టిన ఆ పేరును గౌరవంగా స్వాగతిస్తూ “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ ప్రకటించిన ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న హిందూ, కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
ఇకపోతే వివాహం అనంతరం పలు ఇంటర్వ్యూలలో, ఫ్యాన్స్ మీట్ లో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫేవరెట్ తొలి తెలుగు చిత్రం గురించి చెప్పుకొచ్చింది. రష్మిక మందన్న మాట్లాడుతూ..” నేను తొలిసారి మా నాన్నతో కలిసి ఒక తెలుగు సినిమా చూశాను. అదే మహేష్ బాబు బిజినెస్ మెన్. నేను చూసిన తెలుగు సినిమా మాత్రమే కాదు.. నాకు ఇష్టమైన తెలుగు సినిమా కూడా అదే” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తొలిసారి తన తండ్రితో కలిసి తెలుగు సినిమా చూశానని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇక రష్మికకు ఇష్టమైన మూవీ మహేష్ బాబు మూవీ అని తెలియడంతో అటు ఘట్టమనేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Actress Hema: భర్తతో విడిపోయిన హేమా.. ఒక్కమాటతో దిమ్మతిరిగే కౌంటర్!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. వీరిద్దరూ కలిసి మూడవసారి రణబాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరొకవైపు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే సినిమాలో నటిస్తుండగా.. ఇటు రష్మిక మందన్న మైసా అనే చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి అయితే వరుస సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలతో దూసుకుపోతోంది.