E-Paper
Advertisement

New Toll Rules: ఇక టోల్ గేట్ దగ్గర ఆడాల్సిన అవసరం లేదు, నేరుగా వెళ్లిపోవచ్చు!

New Toll Rules: ఇక టోల్ గేట్ దగ్గర ఆడాల్సిన అవసరం లేదు, నేరుగా వెళ్లిపోవచ్చు!
Advertisement

India’s New Toll System: కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు టోల్ ప్లాజాల దగ్గర ఆగి చెల్లించడం లేదంటే FASTag ద్వారా పే చేయడం జరిగేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం టోలింగ్ వ్యవస్థను మరింత సులభతరం, వేగవంతం చేయడానికి కొత్త మార్పులు తీసుకొచ్చింది. అదే సమయంలో టోల్ చెల్లించకుండా వెళ్లిపోయే వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ నిబంధనలు రూపొందించారు.

ఇకపై టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు!

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజాగా ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థపై ఆధారపడి పని చేస్తుంది. అంటే, ఇకపై టోల్ ప్లాజాల దగ్గర బూమ్ బ్యారియర్లు ఉండవు. వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. టోల్ చెల్లింపులు పూర్తిగా డిజిటల్‌గా జరుగుతాయి. దీనికోసం RFID రీడర్లు, ANPR కెమెరాలు ఉపయోగిస్తారు. ఇవి వెహికల్ నంబర్ ప్లేట్, FASTag వివరాలను గుర్తించి ఆటోమేటిక్‌ గా ఫీజును కట్ చేస్తాయి.

టోల్ చెల్లించకపోతే డబుల్ ఫైన్!

Advertisement

ఈ కొత్త వ్యవస్థలో టోల్ చెల్లించని వాహనాలపై మరింత బాదుడు పడనుంది. ఒకవేళ టోల్ చెల్లించకుండా వెళ్లిపోతే అసలు టోల్ ఫీజుకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒక చిన్న సడలింపు ఇచ్చింది. టోల్ దాటిన 72 గంటలలోపు ఫీజు చెల్లిస్తే, సాధారణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ టోల్ చెల్లించకుండా వెళ్లిపోయినట్లయితే, చెల్లించని యూజర్ ఫీజు పేరుతో ఒక ఇ-నోటీసు జెనరేట్ అవుతుంది. ఈ నోటీసులో వాహనం వివరాలు, టోల్ దాటిన తేదీ, ప్రదేశం, చెల్లించాల్సిన మొత్తం లాంటి వివరాలు ఉంటాయి. ఈ నోటీసు SMS, ఇమెయిల్, మొబైల్ యాప్ ద్వారా వాహనదారులకు పంపించబడుతుంది. అటు ఆన్‌ లైన్ పోర్టల్‌ లో కూడా చూసుకునే అవకాశం ఉంటుంది.

నోటీసు వచ్చిన 72 గంటల్లోగా చెల్లించాలి!

ఇ-నోటీసు వచ్చిన తర్వాత 72 గంటలలోపు టోల్ ఫీజ్ చెల్లించాలి. ఒకవే మీకు నోటీసుపై అభ్యంతరం ఉంటే, అదే 72 గంటలలోపు ఆన్‌ లైన్‌ లో ఫిర్యాదు చేయాలి. టోలింగ్ సంస్థ ఆ ఫిర్యాదును పరిశీలించి ఐదు రోజులలోపు నిర్ణయం తీసుకుంటుంది. ఐదు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే, ఆ క్లెయిమ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇక ఇ-నోటీసు వచ్చిన తర్వాత కూడా 15 రోజుల పాటు చెల్లించకపోతే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. మీ చెల్లించని టోల్ వివరాలు VAHAN సిస్టమ్‌లో నమోదు అవుతాయి. ఆ తర్వాత మీరు వాహనానికి సంబంధించిన కొన్ని సేవలు పొందడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుం ది. RC రెన్యువల్, ట్రాన్స్‌ ఫర్ లాంటి సమయాల్లో ఇబ్బందులు తప్పవు. ఈ కొత్త నిబంధనలు టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Advertisement

Read Also: వెహికల్ కలర్ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుందా? కచ్చితంగా ఈ విషయం తెలియాల్సిందే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×