E-Paper
Advertisement

Rashmika – Vijay Devarakonda : మరోసారి జంటగా దొరికేసిన ‘విజయ్-రష్మిక’.. హాలిడే టైమ్ అంటూ పోస్ట్

Rashmika – Vijay Devarakonda : మరోసారి జంటగా దొరికేసిన ‘విజయ్-రష్మిక’.. హాలిడే టైమ్ అంటూ పోస్ట్
Advertisement

Rashmika – Vijay Devarakonda :  టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఈ పేర్లు వింటేనే ఫ్యాన్స్‌కు ఒక రకమైన పూనకం వస్తుంది. తెరపై వీరి కెమిస్ట్రీ ఎంత హిట్టో, తెర వెనుక వీరి స్నేహం అంతకంటే హాట్ టాపిక్. తాజాగా వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరడం సినీ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.

ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయ్, రష్మిక జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మాస్కులు ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడినప్పటికీ, డేగ కళ్ల నెటిజన్లు వారిని వెంటనే గుర్తుపట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వరుస షూటింగ్స్‌తో ఊపిరి సలపకుండా ఉన్న ఈ స్టార్స్, కాస్త గ్యాప్ దొరకడంతో ఇలా హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోయారు.

Advertisement

విజయ్ ఆసక్తికర క్యాప్షన్
విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విజయ్ రిలాక్స్‌డ్‌గా కూర్చుని ఉండగా, రష్మిక ఒక పోలరాయిడ్ కెమెరాతో అతడిని ఫొటో తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఫుల్ సినిమా షూటింగ్స్ తర్వాత.. ఇప్పుడు హాలిడే టైమ్ అంటూ విజయ్ ఇచ్చిన క్యాప్షన్ వీరి వెకేషన్‌ను కన్ఫర్మ్ చేసింది.

నిశ్చితార్థం నిజమేనా?
అక్టోబర్‌లో వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వేడుకల కోసం జంటగా వెళ్లడం చూస్తుంటే, త్వరలోనే ఏదో ఒక గుడ్ న్యూస్ వింటామేమో అని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఈ వెకేషన్ నుంచి రష్మిక ఏవైనా అందమైన ఫోటోలను షేర్ చేస్తుందా? ఈ రౌడీ జంట తమ రిలేషన్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×