E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడి దారుణ హత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడి దారుణ హత్య
Advertisement

బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆగిపోవడం లేదు. వారం క్రితం జరిగిన ఒక హిందూ యువకుడి హత్య ఘటన మరువకముందే.. తాజాగా మరో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజ్‌బరి జిల్లాలో అమృత్ అనే హిందూ యువకుడిని అల్లరి మూకలు అతి కిరాతకంగా హత్య చేశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా.. అక్కడి మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను మరింత పెంచింది.

వివరాల ప్రకారం.. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా అమృత్‌పై దాడి చేసి ప్రాణాలు తీశారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యక్తులపై దాడులు పెరగడం గమనార్హం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు హిందూ యువకులు బలవ్వడం అక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది.

Advertisement

రాజ్‌బరి జిల్లాలో జరిగిన ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నిందితులు ఎవరు? ఈ దాడి వెనుక ఉన్న కారణాలేంటి? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వరుస హత్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు స్పందించాలని, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు రక్షణ కల్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరంతరాయంగా జరుగుతున్న ఈ దాడులు మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Surat man falls from 10th floor: మృత్యువుతో పోరాడి గెలిచాడు.. 10వ అంతస్తు నుంచి జారిపడినా ప్రాణాలతో బయటపడ్డ వైనం

Related News

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×